ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడి నుంచి బయటపడేందుకు!

ABN, First Publish Date - 2020-11-12T05:30:00+05:30

మానసికి ఒత్తిడి ఆరోగ్యం మీద, రోజూవారి పనుల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఒత్తిడి తాలూకు లక్షణాలను గమనిస్తూ, ఆహారంతో పాటు జీవనశైలి పరంగా కొన్ని మార్పులు చేసుకుంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానసికి ఒత్తిడి ఆరోగ్యం మీద, రోజూవారి పనుల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఒత్తిడి తాలూకు లక్షణాలను గమనిస్తూ, ఆహారంతో పాటు జీవనశైలి పరంగా కొన్ని మార్పులు చేసుకుంటూ నిపుణుల సలహాలు పాటిస్తూ ఎవరికి వారు సొంతంగా ఈ సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్వేతా శర్మ. ఒత్తిడిని జయించేందుకు ఆమె చేస్తున్న సూచనలు ఏమిటంటే...


  1. ముందుగా చేయాల్సిందేమంటే మీ భావాలను, మీరు దిగులుగా ఉండడాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే ఒత్తిడి నుంచి బయటపడేందుకు చర్యలు మొదలుపెట్టడం సాధ్యమవుతుంది.
  2. ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ఉండాలి. ప్రస్తుతం మీరు చేయగలిగే పనుల మీద దృష్టి పెట్టాలి. 
  3. ఏది శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలానే ఒత్తిడికి సరైన చికిత్స, స్నేహితులు, కుటుంబసభ్యుల సహకారంతో బయటపడొచ్చనే సంగతి మరచిపోవద్దు.
  4. మానసిక ఒత్తిడికి గురయినప్పుడు బయటకు మాట్లాడడం చాలా ముఖ్యం. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మీ పరిస్థితి గురించి వివరించి, తొందరగా నిపుణుల సాయం తీసుకోవాలి.
  5. ఆహారం, నిద్ర విషయంలో సమయపాలన కచ్చితంగా పాటించాలి. దీంతో మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అలానే గట్టిగా శ్వాసతీసుకోవడం ద్వారా కొంత తేలికగా అనిపిస్తుంది. 
  6. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునేందుకు మీ అభిరుచులను కొనసాగించాలి. మీ పెంపుడు జంతువుతో ఆడుకోవడం, నచ్చిన సంగీతం వినడం, వంట చేయడం... ఇలా మీకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఒత్తిడి ప్రభావం తగ్గిపోతుంది.
  7. సరైన ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి. 

Updated Date - 2020-11-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising