ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్ర‌రాజ్యంలో 15 ల‌క్ష‌లు దాటిన కోవిడ్ కేసులు...

ABN, First Publish Date - 2020-05-17T19:13:34+05:30

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అగ్ర‌రాజ్యం అమెరికాలో మృత్యుఢంకా మోగిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్ డీసీ: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ అగ్ర‌రాజ్యం అమెరికాలో మృత్యుఢంకా మోగిస్తోంది. కోవిడ్‌-19 మృత్యు హేల కొన‌సాగుతున్న యూఎస్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 ల‌క్ష‌లు దాటిపోయింది. అలాగే 90వేలకు పైగా మ‌ర‌ణాలతో అగ్ర‌రాజ్యం మొద‌టి స్థానంలో కొన‌సాగుతోంది. ఒక్క న్యూయార్క్‌లోనే 3.58 ల‌క్ష‌ల మంది కోవిడ్‌ బాధితులు ఉండ‌గా, 28వేల మ‌ర‌ణాలు సంభ‌వించాయి. న్యూయార్క్ త‌ర్వాత న్యూజెర్సీ, ఇల్లినాయిస్‌, మసాచుసెట్స్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా, మిచిగాన్ త‌దిత‌ర రాష్ట్రాల్లో క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉంది.


అమెరికా త‌ర్వాత అత్యాధిక మ‌ర‌ణాలు సంభ‌వించిన జాబితాలో బ్రిట‌న్‌(34,466), ఇట‌లీ(31,763), ఫ్రాన్స్‌(27,625), స్పెయిన్‌(27,563) ఉన్నాయి. అయితే, యూఎస్ త‌ర్వాత అత్యాధిక క‌రోనా పాజిటివ్ కేసులు ర‌ష్యా(281,752)లో న‌మోదు కాగా... మ‌ర‌ణాలు మాత్రం కేవ‌లం 2,631 ఉన్నాయి. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బాధితులు 47 ల‌క్ష‌లు ఉండ‌గా, మృతుల సంఖ్య 3 లక్ష‌లు దాటిపోయింది.       

Updated Date - 2020-05-17T19:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising