ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్ర‌రాజ్యంలో తగ్గని మ‌హ‌మ్మారి ఉధృతి.. బ్రెజిల్‌లో విల‌యం !

ABN, First Publish Date - 2020-07-22T14:08:36+05:30

కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే 1.47 లక్షల మందికి సోకిన వైరస్‌ కోటిన్నర మార్కు దిశగా దూసుకెళ్తోంది. అమెరికా తర్వాత అత్యధిక ప్రభావానికి గురైన బ్రెజిల్‌లో అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారోతో సహా నలుగురు మంత్రులకు ఇప్పటికే కరోనా సోకగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెజిల్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా

ఈజిప్టు జైళ్లలో 14 మంది బలి

వాషింగ్టన్‌, జూలై 21: కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే 1.47 లక్షల మందికి సోకిన వైరస్‌ కోటిన్నర మార్కు దిశగా దూసుకెళ్తోంది. అమెరికా తర్వాత అత్యధిక ప్రభావానికి గురైన బ్రెజిల్‌లో అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారోతో సహా నలుగురు మంత్రులకు ఇప్పటికే కరోనా సోకగా.. తాజాగా మరో ఇద్దరు మంత్రులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేశంలో కొత్తగా 21 వేల కేసులు వెలుగుచూడగా మొత్తం బాధితుల సంఖ్య 21 లక్షలు దాటింది. ఇప్పటివరకు 80వేల మందికిపైనే మరణించారు.


అమెరికాలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టేలా లే దు. గత 24 గంటల్లో ఇక్కడ 62,879 మం దికి పాజిటివ్‌గా తేలగా.. మొత్తం కేసుల సంఖ్య 39,61,429గా నమోదైంది. కరోనాతో ఇప్పటివరకు 1.43 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో మరో 5,842 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 7,83,328కి పెరిగింది. దక్షిణాఫ్రికాలో మరో 9,300 కేసులు బయటపడగా కరోనాతో 143 మంది మరణించారు. ఇక వైరస్‌ పుట్టినిల్లు చైనాలో కొత్తగా 8 కేసులు బయటపడ్డాయి. సింగపూర్‌లో 399 మందికి పాజిటివ్‌గా తేలింది. వారిలో ఎక్కువశాతం మంది వర్క్‌వీసాపై వచ్చి వసతి గృహాల్లో ఉంటున్నవారే. పాకిస్థాన్‌లో 1,013 కొత్త కేసులు బయటపడగా దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,66,096కి చేరుకుంది. రొమేనియాలో ఇప్ప టి వరకు 38 వేల మందికి వైరస్‌ సోకగా.. వారిలో 2,038 మంది చనిపోయారు. ఈజిప్టు జైళ్లలో ఇప్పటి వరకు అనేక మందికి వైరస్‌ సోకింది. వారిలో 14 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-07-22T14:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising