ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 14లక్షల మంది భారతీయులు!

ABN, First Publish Date - 2020-09-18T02:24:27+05:30

కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగశాఖ సహాయ మం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన.. ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు 14,12,834 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ఆరో విడత ‘వందే భారత్ మిషన్ ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 24 వరకు ఈ దశ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విడతలో మొత్తం 1,007 అంతర్జాతీయ విమానాలు.. భారతీయులను స్వదేశానికి తరలించనున్నాయని చెప్పారు. కాగా.. ‘వందే భారత్ మిషన్’ మే 7న ప్రారంభమైన విషయం తెలిసిందే.


Updated Date - 2020-09-18T02:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising