ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్ మంత్రికి సోకిన 'కరోనా'

ABN, First Publish Date - 2020-03-11T18:34:49+05:30

బ్రిటన్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా వైరస్ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా వైరస్ సోకింది. మంత్రికి వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహాపై తాను ముందుజాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. డోరీస్ గతంలో 2019 నుంచి స్టేట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ కేర్ పార్లమెంటరీ అండర్ సెక్రటరీగాను పనిచేశారు. కాగా, యూకేలో కరోనా వైరస్ వచ్చిన మొట్టమొదటి ప్రజాప్రతినిధి డోరీస్ కావడం గమనార్హం. ‘‘నేను చేయించుకున్న పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది... వైద్యుల సలహాపై నేను ఇంట్లోనే స్వయం ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతున్నాను’’ అని డోరీస్ పేర్కొన్నారు. యూకేలో ఇప్పటివరకు 380 కరోనా కేసులు నమోదు కాగా, ఆరుగురు చనిపోయారు.

Updated Date - 2020-03-11T18:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising