ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకేలో డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్న 'కొవిడ్'‌.. 31 వేలు దాటిన మ‌ర‌ణాలు

ABN, First Publish Date - 2020-05-10T02:31:14+05:30

ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్... అటు అగ్ర‌రాజ్యాల‌ను సైతం వ‌ణికిస్తోంది. బ్రిట‌న్‌లో శ‌ర‌వేగంగా ప్ర‌బ‌లుతున్న 'కొవిడ్‌-19' ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 31 వేలు దాటిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండ‌న్: ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్... అటు అగ్ర‌రాజ్యాల‌ను సైతం వ‌ణికిస్తోంది. బ్రిట‌న్‌లో శ‌ర‌వేగంగా ప్ర‌బ‌లుతున్న 'కొవిడ్‌-19' ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 31 వేలు దాటిపోయింది. శుక్ర‌వారం న‌మోదైన‌ 626 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు యూకేలో 31,241 మంది క‌రోనాకు బ‌ల‌య్యారని ఆ దేశ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. నిన్న ఈ వైర‌స్‌తో చనిపోయిన వారిలో 6 వారాల ప‌సికందు కూడా ఉన్న‌ట్లు నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్ పేర్కొంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం 2,15,260 మంది క‌రోనా బాధితులు ఉన్నారు. అమెరికా(78,762) త‌ర్వాత క‌రోనాతో అధికంగా మృతి చెందిన వారు యూకేలోనే ఉన్నారు. బ్రిట‌న్ త‌ర్వాత ఇట‌లీ(30,201), స్పెయిన్‌(26,478), ఫ్రాన్స్‌(26,230) ఉన్నాయి. అటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 40 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా... 2.77 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు.

Updated Date - 2020-05-10T02:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising