ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్!

ABN, First Publish Date - 2020-03-29T01:40:03+05:30

కరోనా వైరస్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్‌లపై కూడా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. బ్రిటన్ ప్రధాని, ఆరోగ్య మం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా వైరస్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్‌లపై కూడా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. బ్రిటన్ ప్రధాని, ఆరోగ్య మంత్రి కూడా కరోనా బారినపడటమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా ఇప్పటికే లాక్‌డౌన్ విధించిన బ్రిటన్.. మరో ఆరునెలలపాటు (సెప్టెంబర్ వరకు) లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్రిటన్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా స్పష్టం చేశారు. స్థానిక మీడియాతో మాట్లాడిన జెన్నీ హ్యారీస్.. లాక్‌డౌన్‌ను పొడగించాల్సిన అవసరాన్ని వివరించారు. 


‘ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే.. కరోనా కట్టడికి ఇప్పటి దాకా పడిన శ్రమ వృథా అవుతుంది. ఆరు నెలల లాక్‌డౌన్ కాలంలో పరిస్థితులను బట్టి ఆంక్షలను క్రమంగా సడలిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా.. మహమ్మారి బారినపడి బ్రిటన్‌లో ఇప్పటికే 759 మంది మరణించారు. ఇకపోతే 14,543 మందికి కరోనా వైరస్ సోకింది. ఇదిలా ఉంటే కొవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 27వేలు దాటింది. 


Updated Date - 2020-03-29T01:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising