ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా చర్యకు చైనా ప్రతీకారం

ABN, First Publish Date - 2020-07-28T13:05:50+05:30

అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయడంపై చైనా ప్రతీకారం తీర్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెంగ్దూలో యూఎస్‌ కాన్సులేట్‌ మూసివేత

శాంఘై సమీపంలోకి అమెరికా యుద్ధ విమానం

బీజింగ్‌/చెంగ్దూ, జూలై 27: అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయడంపై చైనా ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం చెంగ్దూలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని చైనా మూసి వేసింది. ఉదయం 10గంటలకు చెంగ్దూలోని యూస్‌ కాన్సులేట్‌ను స్వాధీనం చేసుకున్న చైనా అధికారులు కార్యాలయ భవనంపై ఉన్న అమెరికా జెండా ను తొలగించారు. నైరుతిచైనాలోని సిచువాన్‌ ప్రాంతానికి చెంగ్దూ రాజధాని. గూఢచర్యం ఆరోపణలతో హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని అమెరికా ప్రభుత్వం బుధవారం మూసివేసింది. దీంతో చైనా ఈ ప్రతీకార చర్యకు దిగింది.


కాగా, చైనా తీరును అమెరికా ఖండించింది. 35 ఏళ్లుగా పశ్చిమ చైనా, టిబెట్‌ ప్రజలతో బంధానికి చెంగ్దూ కాన్సులేట్‌ ప్రతీకగా నిలిచిందని పేర్కొంది. చైనాలోని ఇతర కార్యాలయాల ద్వారా ఆ ప్రాంతవాసుల తో సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తామని అమెరికా పేర్కొంది. కాగా, చైనా ప్రతీకారం నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానాలు చైనీస్‌ మె యిన్‌ల్యాండ్‌ ప్రాంతానికి దగ్గరగా వెళ్లాయి. ఇందులో ఒక విమానం శాం ఘైకి 76.5 కి.మీ సమీపంలోకి వెళ్లింది.

Updated Date - 2020-07-28T13:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising