ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేజస్విని, బాబుగోగినేనిపై చాలా కోపం ఉంది.. ఆయన చేసే ప్రతీ టాస్క్ చీటింగే..

ABN, First Publish Date - 2020-02-03T23:08:29+05:30

‘బిగ్‌బాస్‌’కు ముందు కౌశల్‌ ఒక మామూలు మోడల్‌. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో అతడి ఒంటరి పోరాటం... ‘కౌశల్‌ ఆర్మీ’ని తయారుచేసింది. ‘బిగ్‌బాస్‌-2’ విజేతగా నిలిపింది. కౌశల్‌ ఇప్పుడొక బిగ్‌ సెలబ్రిటీ. ప్రస్తుతం కౌశల్‌ ముందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌశల్ లెవల్ ఏంటని మాట్లాడారు. నా పర్సనల్ విషయాలు బయటపెట్టారు..

బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చాక ఒక్క హౌస్‌మేట్‌ కూడా ఫోన్‌ చేయలేదు

నేను గెలిచానని అనౌన్స్ చేసినప్పుడు ఒక్కరు కూడా లేచి నిలుచోలేదు..

ఎందుకీ గోల.. వెళ్లిపోదాం.. అని రెండోవారంలో అనిపించింది

బిగ్‌బాస్ సీజన్-1కు పిలిచారు కానీ.. వెళ్లలేకపోయాను..

హౌస్‌లో వాళ్లు ముగ్గురు చాలా బద్ధకిష్టులు..

కన్నింగ్‌లో లేకపోతే గేమ్ ఆడలేం.. ముందుకు వెళ్లలేం..

గిన్నిస్‌ బుక్‌ వాళ్లు ఫోన్‌ చేసి వెరిఫికేషన్‌ కోసం రమ్మన్నారు

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్


‘బిగ్‌బాస్‌’కు ముందు కౌశల్‌ ఒక మామూలు మోడల్‌. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో అతడి ఒంటరి పోరాటం... ‘కౌశల్‌ ఆర్మీ’ని తయారుచేసింది. ‘బిగ్‌బాస్‌-2’ విజేతగా నిలిపింది. కౌశల్‌ ఇప్పుడొక బిగ్‌ సెలబ్రిటీ. ప్రస్తుతం కౌశల్‌ ముందు అనేక అవకాశాలు క్యూలు కట్టాయి. అయితే అతడి పయనమెటు? ‘బిగ్‌బాస్‌’ టైటిల్‌ గెలవడానికి హౌస్‌లో అతడు పడ్డ కష్టాలేంటి? 07-10-2018న  ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో కౌశల్‌-నీలిమ దంపతులు మాట్లాడారు. ఆ విశేషాలే ఇవి...

 

హలో కౌశల్‌... ‘బిగ్‌బాస్‌-2’ విన్నర్‌ అయినందుకు అభినందనలు. ఎలా ఉంది ఆ అనుభూతి?

ఇంకా అదే ఫీలింగ్‌లో ఉన్నానండి. బిగ్‌బాస్‌ హౌస్‌లో టైటిల్‌ గెలుచుకుని, బయటికి వచ్చిన తరువాత నా కోసం కొన్ని వేల మంది వేచి ఉండటం చూసి నిజంగా షాకయ్యాను. ‘కౌశల్‌ ఆర్మీ’ అని లోపల ఎవరో చెబితే విన్నాను. కానీ ఇంత మంది ఉంటారని అనుకోలేదు. వాళ్లంతా హౌస్‌ నుంచి ఇంటి వరకు దాదాపు నాలుగు వందల బైక్స్‌తో ర్యాలీగా వచ్చారు.

 

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లేవరకూ కౌశల్‌ ఒక చిన్న సెలబ్రిటీ. చాలా మందికి తెలియదు. ఇప్పుడు అంత మంది అభిమానులు ఎలా వచ్చారు? అసలు ‘ఆర్మీ’ ఏంటి? ఎవరి మీద దండయాత్ర? ఏమిటీ మిస్టరీ?

బయట ఏమవుతోందో నాకు తెలియదు. ఎవరైనా సరే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటరయ్యారంటే... ఓర్పు కావాలి. వ్యక్తిత్వం ఉండాలి. దాంతో పాటు మనం ఏ పని కోసం వచ్చామో ఆ వైపు అడుగులు వేస్తూ వెళ్లాలి. ఉన్న 17 మంది కంటెస్టెంట్లలో 16 మంది నాకు వ్యతిరేకమైతే... నేను వన్‌మ్యాన్‌ ఆర్మీగా ఫైట్‌ చేసుకుంటూ వచ్చాను. వాళ్లందరూ నన్ను బయటకు పంపించాలనుకున్నప్పుడు, ఈ వన్‌మ్యాన్‌ ఆర్మీకి ఒక్కొక్కరూ ఒక్కో ఆర్మీగా తయారయ్యి, అలా కొన్ని వేల మంది ‘కౌశల్‌ ఆర్మీగా’ మారారు. లోపల నేను పడిన బాధను చూసిన చాలా మంది నా కోసం నిలబడ్డారని, బయటకు వచ్చిన తరువాత తెలిసింది.

 

అందరూ కలిసి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు... ‘ఎందుకీ గోల... వెళ్లిపోదాం’ అనిపించలేదా?

రెండో వారంలో అలా అనిపించింది సార్‌! బయట ఎంతో హ్యాపీగా షూటింగ్స్‌, ఈవెంట్స్‌ చేసుకుని బతుకుతున్నాం. ఇక్కడ ఒక షోకు వచ్చి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఏంటనిపించింది. నాని గారికి చెప్పాను... ‘నేను వెళ్లిపోవాలనుకుంటున్నాను’ అని! అప్పుడాయన... ‘కౌశల్‌... షో ప్రారంభమై రెండు వారాలే అయింది. అప్పుడే వేల మంది అభిమానులు నీ కోసం చూస్తున్నారు. నువ్వేంటో ప్రూవ్‌ చెయ్యాలి’ అన్నారు. నాకు అంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారని తెలిసి, ఎలాగైనా వాళ్ల కోసం షో గెలవాలని నిర్ణయించుకున్నా.

 

మనం ఒక్కళ్లమే ఒక వైపు... మిగతా ప్రపంచమంతా మరో వైపు ఉన్నప్పుడు మనలో కూడా తప్పు ఏదో ఉండుండాలి కదా! లేకపోతే అందరూ మనల్నే ఎందుకు దూరం పెడతారు?

షో ఆరంభంలో ప్రతి ఒక్కరూ ‘అక్కా, చెల్లి, అన్న, అమ్మ...’ అంటూ రిలేషన్స్‌ పెట్టేసుకున్నారు. నాకప్పుడు అర్థమైపోయింది... ఇది సేఫ్‌ గేమ్‌ అని. ఈ రిలేషన్స్‌ పెట్టుకున్న వాళ్లంతా సీజన్‌ మొత్తంలో ఒకళ్ల మీద ఒకళ్లు వ్యతిరేకంగా ఓటు చేసుకోలేరు. అయితే అక్కడ నేను రిలేషన్స్‌ పెట్టుకోవాల్సింది ‘బిగ్‌ బాస్‌’తో, హోస్ట్‌ నాని గారితో... నా అభిమానులతో! ఒకవేళ కంటెస్టెంట్స్‌తో అలా బంధాలు కలుపుకుంటే, వాళ్లేమన్నా తప్పు చేస్తే, నేనేం అనలేను. అందుకే నాకు గేమ్‌ ముఖ్యం, బంధాలు కాదని చెప్పుకుంటూ వచ్చా.


సాధారణంగా ఆడపిల్లలు ఉన్నప్పుడు అక్కఅనో, చెల్లి అనో వరుసలు కలుపుతారు కదా! అలా మీకెందుకు అనిపించలేదు?

ఫస్ట్‌ డే, ఫస్ట్‌ ఎపిసోడ్‌లో సంజన అనే కంటెస్టెంట్‌ జైల్లో ఉంది. తనను విడిపించడానికి నా దగ్గర ‘జైలు కార్డు’ ఉంది. కానీ నాకెందుకో ఆ అమ్మాయిని విడిపించాలనిపించలేదు. కాకపోతే తను ఫస్ట్‌ టైమ్‌ జైలుకు వెళ్లింది. జైలు కార్డు ఉండి కూడా విడిపించలేదనే భావనతో ఆ అమ్మాయి చెయ్యి పట్టుకున్నా. తరువాతి వారం నాని గారి ఓపెనింగ్‌.. ‘ప్లే బాయ్‌ కౌశల్‌’ అని! ఐ యామ్‌ వెరీ హ్యాపిలీ మ్యారీడ్‌ మ్యాన్‌. జస్ట్‌ ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుంటేనే ప్లే బాయ్‌ని అయిపోతానా? మరి మిగతా వాళ్లు హగ్గులు, కిస్సులు, ఒకళ్ల మీద ఒకళ్లు కూర్చోవడాలు చూస్తే... వాళ్ల పరిస్థితి బయటెలా ఉంటుందా అనిపించింది. కానీ, ఎప్పుడైతే నన్ను ‘ప్లేబాయ్‌’ అన్నారో... అప్పటి నుంచి టచ్‌ కాదు కదా... అసలు ఎవరి దగ్గరికీ వెళ్లలేదు. 


ఇంతకీ కౌశల్‌ ప్లేబాయా కాదా?

నీలిమ: (కౌశల్‌ భార్య): కాదండీ (నవ్వు). ఆయనకు మాతో గడపడానికే టైమ్‌ ఉండదు.

కౌశల్‌: ఉంటే షూటింగ్‌కు వెళతా. లేదంటే ఉదయం ఆఫీస్‌కు వెళ్లి, అర్ధరాత్రి వరకూ పనిచేస్తూనే ఉంటాను. అక్కడ కూడా నేను ‘వన్‌మ్యాన్‌ ఆర్మీ’నే! బేసిగ్గా నేనెవరినీ నమ్మను. కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వాడిని కాబట్టి కష్టంతోనే బయటకు వెళతా. ఐ యామ్‌ నాట్‌ ఎ ప్లేబాయ్‌.

 

‘కౌశల్‌ కెమెరాలకు దొరక్కుండా మిస్‌ బిహేవ్‌ చేశాడ’ని బయటకు వచ్చిన తరువాత కొంతమంది పార్టిసిపెంట్స్‌ కామెంట్స్‌ చేశారు. ‘అసలు నీలిమ మిమ్మల్ని ఎలా భరిస్తోందో’నన్న కామెంట్సూ వచ్చాయి!

నీలిమ: నేను వాటికి ముందే సమాధానం చెప్పాను... ‘ఇది భరించడం కాదు. ఆయన భార్యగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అని! ఒక వ్యక్తి క్యారెక్టర్‌ను వారంలో మీరెలా జడ్జ్‌ చేయగలుగుతారు? అన్ని కెమెరాలున్నప్పుడు ఒక రియాలిటీ షోలో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అదీకాక తను పెళ్లయిన వ్యక్తి. తనకొక కుటుంబం, పిల్లలు ఉన్నారు. ఎవరి మీద నింద వేస్తున్నామనే కనీస ఇంగితం లేకుండా మాట్లాడారు. అది వాళ్లకే వదిలేయాలి. 

కౌశల్‌: (అమ్మాయిని) పట్టుకోవడానికి ‘బిగ్‌బాస్‌’ దాకా వెళ్లక్కర్లేదు సార్‌. నేనున్నదే మోడలింగ్‌లో (నవ్వు). హౌస్‌లో ఒక టాస్క్‌ యజమాని ఇచ్చినప్పుడు దాన్ని సేవకుడిగా ఉన్న నేను పూర్తి చేయాలి. ‘ఆ అమ్మాయిని ఎత్తుకురా’ అన్నారు. ఆ అమ్మాయి దీప్తీ సునయన. పిల్లి వేషంలో ఉంది. పిల్లిని ఎలా పట్టుకుంటారో అలాగే తనను పట్టుకుని తీసుకువచ్చా. ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయి... ‘మీరు నన్ను అలా పట్టుకోవడం నచ్చలేదు’ అంది. ‘టాస్క్‌లో ఒక భాగంగా తీసుకువచ్చాను. యూ ఆర్‌ లైక్‌ మై సిస్టర్‌. ప్రతి దానికీ ఎందుకలా ఫీలవుతావు’ అన్నాను.


సో... ఆఖరికి మీకు కూడా వరుస కలపక తప్పలేదు!

హ్హహ్హహ్హా... అంటే చెల్లిలాగా చూసుకున్నాను. అంతే గానీ రిలేషన్‌ కలుపుకోలేదు. నా కంటే పదమూడు పధ్నాలుగేళ్లు చిన్న. ఆబ్వియస్లీ షీ ఈజ్‌ ఈక్వల్‌ టూ మై సిస్టర్‌.


మీ వారిని ఇంత సపోర్ట్‌ చేస్తున్నారు. ఆయన్ను అర్థం చేసుకుని, పెళ్లి చేసుకోవడానికి మీకెంత టైమ్‌ పట్టింది?

నీలిమ: మాది ప్రేమ వివాహం. గర్ల్‌ఫ్రెండ్స్‌ దగ్గరి నుంచి ప్రతిదీ ఆయన నాకు చెప్పారు. తనది మోడలింగ్‌ నేపథ్యం. ఆయన ఒక నటుడు. నేను సాధారణ మధ్యతరగతి అమ్మాయిని. గుంటూరు జిల్లా మాది. నన్ను ట్రాప్‌ చేయడానికో, ఫ్లర్ట్‌ చేయడానికో ఆయన అన్నీ నాకు చెప్పక్కర్లేదు. కానీ తను మా పెద్దలను కలిసి, వాళ్ల ద్వారా పెళ్లి ప్రస్తావన తెచ్చిన విధానం నాకు బాగా నచ్చింది. తరువాత మా వాళ్లను ఒప్పించడం... ఇలా మా పరిచయం అంతా పెళ్లి గురించే జరిగింది. తరువాత కూడా ప్రతిదీ దాచుకోకుండా నాతో చెబుతూనే ఉన్నారు.


 అంటే అంతకు ముందే లేచి రెడీ అవుతారా?

చాలామంది రాత్రి పడుకొనే ముందు లిప్‌స్టిక్‌ వేసుకుని పడుకుంటారు. అక్కడ 24 గంటల్లో మనకు చూపించేది గంటన్నర. ఆ మిగిలిన టైమ్‌లో ఏదైనా చేసుకోవచ్చు. నాకైతే ఎక్కడున్నా పొద్దున్నే పూజ చేసి, దేవుడికి, అమ్మకు దణ్ణం పెట్టుకుని పని మొదలు పెట్టడం అలవాటు. నేను హిందూ దేవుళ్లతో పాటు జీసస్‌, అల్లాను కూడా ప్రార్థిస్తా. నాకు అందరూ సమానమే. మా పిల్లలు కూడా అంతే!


క్రికెట్‌లో ఐపీఎల్‌లా, బిగ్‌బాస్‌ టీవీలో వచ్చే ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌. మీరంతా దాంట్లో పాత్రధారులు. దాన్ని ఎంజాయ్‌ చేయకుండా తిట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్‌?

కెమెరా ముందుకు వెళితే రీల్‌ యాక్టింగ్‌. బిగ్‌బాస్‌ కెమెరా ముందుకు వెళితే రియల్‌ యాక్టింగ్‌. ఒకటి రెండు రోజులు నటించగలం. అంతేకానీ 114 రోజులు యాక్టింగ్‌ చేయలేం. అక్కడ మనం చేసేదంతా మన నిజమైన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వానికీ, అపోజిట్‌ వ్యక్తిత్వానికి మధ్య జరిగే పోటీయే ‘బిగ్‌బాస్‌’. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత మన నిజమైన క్యారెక్టర్‌ ఏంటో బిగ్‌బాస్‌ చూపిస్తుంది. ఎంత కంట్రోల్‌ చేసుకున్నా కంట్రోల్‌ అవ్వని ఎమోషన్స్‌ అవి.


 కౌశల్‌ అనే వ్యక్తి ఒక్కడినే అని కాకుండా ‘బిగ్‌బాస్‌’కు ఎందుకంత పిచ్చిగా అభిమానులు ప్రవర్తించారు?

‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో జరిగింది చూసి నాకోసం ఫ్యాన్స్‌ అలా తయారయ్యారు. ఎందుకంటే అక్కడ పదహారు మంది పిచ్చి పిచ్చిగా ఒక వ్యక్తి మీద పడుతున్నారు.

నీలిమ: చిన్న సిట్యుయేషన్‌ కౌశల్‌ దగ్గర నుంచి వచ్చినా అందరూ లేచేవారు. మనం గేమ్‌లో ఉన్నాం. ఇక్కడ సిట్యుయేషన్‌ ఏంటి? అన్నది కొంచెం కూడా ఆలోచించడం లేదు. పాజిటివ్‌ ఆర్‌ నెగెటివ్‌ ఏది మాట్లాడినా అందరూ లేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్‌! నచ్చని ఒక వాతావరణంలో అన్ని రోజులు ఎలా ఉండగలుగుతారు. వాళ్లు ఉన్నారు కాబట్టే పర్సనల్‌గా కనెక్ట్‌ అయిపోయారు.


కౌశల్‌ బయటకు కనిపించేంత అమాయకుడు కాదు, కన్నింగ్‌ అంటారు చాలా మంది నిజమేనా?

కన్నింగ్‌ అంటే యస్‌! నా గేమ్‌లో డెఫినిట్‌గా నేను కన్నింగ్‌. ఎందుకంటే కన్నింగ్‌గా లేకపోతే గేమ్‌ ఆడలేం, ముందుకు వెళ్లలేం. నాకొక టాస్క్‌ ఇస్తే, నేను దాన్ని పది రకాలుగా డివైడ్‌ చేసుకుంటాను. ఆ పది రకాల్లో ఆ సమయానికి ఏది సూటవుతుందో, ఆ రకాన్ని పిక్‌ చేసుకుని ముందుకు వెళతాను. నా వ్యక్తిత్వం మీద కొంత మంది ఫ్యాన్స్‌ వచ్చారు. కానీ బిగ్‌బాస్‌ ఎలాగైనా గెలవాలనే నా పట్టుదలతో ప్రతీ టాస్క్‌ను క్రియేటివ్‌గా పూర్తి చేసుకుంటూ వచ్చాను. కాబట్టి వీళ్లందరూ నాకు ‘బిగ్‌బాస్‌’ గెలవడానికి సహకరించారు.

 

ఏదైనా ప్లాన్‌ ఉందా? ‘బిగ్‌బాస్‌’ విన్నర్‌ కావడం వల్ల అవకాశాలు వస్తాయని ఆశ ఉందా?

నాకు ఇది లైఫ్‌లో బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్‌. గిన్నిస్‌ బుక్‌ వాళ్లు కూడా ఫోన్‌ చేశారు (కౌశల్‌కు 43 కోట్ల ఓట్లు వచ్చాయి). వెరిఫికేషన్‌ కోసం రమ్మన్నారు. ఈ అచీవ్‌మెంట్‌ను ఎలా ఉపయోగించుకోవాలన్నది బిగ్‌ టాస్క్‌. 


ఇన్ని రోజుల ప్రయాణంలో ఎవరి మీద ఎక్కువ కోపం ఉంది?

తేజస్విని, బాబు. నేను భోజనం చేస్తుంటే తేజస్విని నన్ను సిగ్గులేకుండా తింటున్నావని అంది. చాలాసార్లు బ్యాడ్‌ వర్డ్స్‌ యూజ్‌ చేసింది. అవి టెలికాస్ట్‌ అయ్యాయో లేదో తెలియదు. ఇక బాబు గోగినేని చేసే ప్రతి టాస్క్‌ చీటింగే. కౌశల్‌ లెవెల్‌ ఏంటి? అని మాట్లాడారు. నాలుగో వారం వరకు నేను ఆయనతో చాలా క్లోజ్‌గా ఉన్నాను. పర్సనల్‌ విషయాలు షేర్‌ చేసుకున్నాను. ఒక బ్రదర్‌గా షేర్‌ చేసుకున్న విషయాలు బయటపెట్టడంతో ఐ ఫెల్ట్‌ బ్యాడ్‌.


మీరు చెబితే నమ్మరు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకొచ్చాక ఒక్క హౌస్‌మేట్‌ కూడా ఫోన్‌ చేయలేదు. ఒక వ్యక్తి గెలిచాడని అనౌన్స్‌ చేసినపుడు నిలుచుని క్లాప్స్‌ కొడతారు. మా కంటెస్టెంట్స్‌ ఒక్కరూ కూడా నిలుచోలేదు. ఒక వ్యక్తి గెలుపును ఎప్పుడైతే స్వీకరించలేదో నేను అప్పుడే వారిని వదిలేశాను. గేమ్‌ని గేమ్‌గానే చూడాలి. కానీ వాళ్లు చూడలేదు. తనీష్‌ ‘బయటకొచ్చాక నీ సంగతి చూస్తా’ అన్నారు.

 

బిగ్‌బాస్ పూర్తయింది. ఇప్పుడు హోప్స్ అంతేనా...

నన్ను ఆర్టిస్టుగా చూడాలని మా అమ్మ చాలా కష్టపడింది. చిన్న చిన్న పాత్రలు వేస్తున్న సమయంలో టీవీలో కనిపిస్తే అపార్టుమెంట్‌ అంతా తిరిగి అందరికీ చెప్పి వచ్చేది. మా ఫాదర్‌ కూడా ఎంత స్ట్రగుల్‌ అయ్యారో నాకు తెలుసు. నేను కొద్ది కొద్దిగా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే మా అమ్మ చనిపోయింది. కళామతల్లినే మా అమ్మగా భావిస్తాను. అవకాశాలు వస్తాయని, ఇకనైనా కౌశల్‌ని ఒక స్ట్రాంగ్‌ యాక్టర్‌గా చేస్తారని కోరుకుంటున్నాను.

 

ఆర్కే: ఐ విష్‌ యు ఆల్‌ ద బెస్ట్‌.

Updated Date - 2020-02-03T23:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising