ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకొక్క‌డు కథ విని విలన్‌గా కూడా నేనే చేస్తానన్నా

ABN, First Publish Date - 2020-02-08T08:32:38+05:30

విక్రమ్.. అపరిచితుడుతో నటనలోని తన విశ్వరూపాన్ని చూపించి.. ప్రయోగాలకు ‘ఐ’కాన్‌గా మారారు. ప్రస్తుతం ‘ఇరుముగన్’ పేరుతో సినీప్రియుల ముందుకు రాబోతున్నారు. ఎప్పుడూ భిన్నత్వాన్ని కోరుకోవడం తనకిష్టమంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విక్రమ్.. అపరిచితుడుతో నటనలోని తన విశ్వరూపాన్ని చూపించి.. ప్రయోగాలకు ‘ఐ’కాన్‌గా మారారు. ప్రస్తుతం ‘ఇరుముగన్’ పేరుతో సినీప్రియుల ముందుకు రాబోతున్నారు. ఎప్పుడూ భిన్నత్వాన్ని కోరుకోవడం తనకిష్టమంటున్నారు. చిన్నప్పటి నుంచే నటుడునవ్వాలని తనకు ఉండేదని విక్రమ్ చెబుతున్నారు. ఫలానా పాత్ర చేయాలని, ఫలానా వారి దర్శకత్వంలో నటించాలని కలలు కనేవాడినన్నారు. ఇంకా తన వ్యక్తిగత, సినీ ప్రయోగాల గురించిన విశేషాల గురించి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో 28-08-2016న పాల్గొని వివరించారు. ఆ కార్యక్రమ పూర్తి వివరాలు... 

 

ఆర్కే: ‘అపరిచితుడు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అంతకుముందు డైరెక్ట్‌ తెలుగు సినిమాలు కొన్ని చేశారు. కానీ అపరిచితుడు వచ్చేవరకు అంత పాపులారిటీ రాలేదు ఎందుకని?

విక్రమ్‌: తెలియదు. (నవ్వులు) నాకు అసలు అలాంటి రోల్‌ అంతకుముందు రాలేదు. నేను హీరోగా శివపుత్రుడు వచ్చింది. ఆ సమయం నాకు స్ట్రగులింగ్‌ పీరియడ్‌. తమిళం, మలయాళం, తెలుగు అన్ని భాషల్లోనూ అసలు హిట్‌ రాలేదు.బంగారు కుటుంబం ఇక్కడ హిట్‌ అయింది. ఆ సినిమాలో నాది ఒక క్యారెక్టర్‌ మాత్రమే. మలయాళంలో కూడా హీరోగా, సెకండ్‌ హీరోగా చేశాను. ఇక్కడ హీరో, యాంటీ హీరోగా చిన్నచిన్న సినిమాలు చేశాను. తరవాత శివపుత్రుడు వరకు... నాకు హిట్‌ అయిన పిక్చర్‌ సేతు. సేతు రీమేక్‌ అయింది. దిల్‌, సామి, జెమిని, కాశీ అన్నీ సినిమాలు రీమేక్‌ అయ్యాయి.శివపుత్రుడులో టోటల్‌గా డీ గ్లామరైజ్‌ పాత్ర. ఎనిమిది నెలలు ఆ సినిమా రిలీజ్‌ కాలేదు. తరవాత డబ్‌ చేసి చూద్దామంటూ రిలీజ్‌ చేశారు. అది పెద్ద హిట్‌ అయింది. తరవాత అపరిచితుడు వచ్చింది.

 

ఆర్కే: అపరిచితుడుతో మీకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. అప్పటినుంచి మీ దగ్గర నుంచి అన్నీ ప్రయోగాలే...?

విక్రమ్‌: నాకు వేరే ఛాన్స్‌ లేదు. చిన్నప్పటి నుంచి నాకు డ్రామాలు అంటే ఇంట్రస్ట్‌. ప్రయోగాలు చేయడమంటే ఆసక్తి. ఏది చేసినా డిఫరెంట్‌గా ఉండాలి. నాకు యాక్టింగ్‌ అంటే ప్యాషన్‌.

 

ఆర్కే: అంత ప్యాషన్‌ రావడానికి మీ ఇంట్లో సినిమా ఇండస్ర్టీలోకి చెందినవారు ఎవరైనా ఉన్నారా?

విక్రమ్‌: అవును. మా నాన్నగారు చిన్నచిన్న రోల్స్‌ చేశారు. విలన్‌గా చేశారు. అసలు ఆయనకు నేను నటిస్తానంటే నమ్మకం ఉండేది కాదు. నేను కూడా మొదట్లో ఒక పోలీస్‌ రోల్‌ చేశాను. నా యాక్టింగ్‌ బాగాలేదని, ఇంకెప్పుడూ పోలీస్‌ రోల్‌ చేయవద్దని నాన్న చెప్పారు. సేతు, సామి సినిమాల్లో చేసిన తరవాత... తన స్థాయికి తగ్గట్టు కాకపోయినా... బాగానే నటించావంటూ మెచ్చుకున్నారు.

 

ఆర్కే: ఇప్పటికీ ఆయన అలాగే అనుకుంటున్నారా? తాను గొప్ప యాక్టర్‌నని? మీరు కాదని?

విక్రమ్‌: ఇప్పుడు కూడా... నా పిక్చర్‌ గురించి చెప్పేటప్పుడు నా లిప్‌ మూమెంట్స్‌ అవీ సరిగ్గా లేవని చెబుతుంటారు. నా ప్యాషన్‌తో పోలిస్తే ఆయన ప్యాషన్‌ చాలా పెద్దది. ఆయన పరమకుడి అనే చిన్న పల్లెటూరి నుంచి వచ్చారు. (కమలహాసన్‌ కూడా అక్కడి నుంచే వచ్చారు) కేవలం నటన కోసమే ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. నేను అయితే అలా చేయలేను.

 

ఆర్కే: ఇప్పటికీ తన తరవాతే మీరు అంటారా?

విక్రమ్‌: డెఫినెట్‌గా... నా లుక్‌, టాలెంట్‌ మీకు వచ్చింది అంటారు. ఇంట్లో ఏదైనా గొడవైనప్పుడు... నా లుక్‌ మీకు ఇచ్చాను.. నా డ్రీమ్స్‌ మీకు ఇచ్చాను అంటుంటారు.


ఆర్కే: ఆ సమయంలో మీ అమ్మ ఎవరిని సపోర్ట్‌ చేస్తారు?

విక్రమ్‌: అమ్మ సహజంగా నావైపే మాట్లాడుతుంది. ఆయన ఏం చేశారో, నేను ఏం చేస్తున్నానో ఆమెకు బాగా తెలుసు. కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఒక యాక్సిడెంట్‌ జరిగి మూడేళ్ళు బెడ్‌పైనే ఉన్నాను. మేజర్‌ యాక్సిడెంట్‌ అది. దాదాపు నాలుగేళ్ళు నిలబడ లేకపోయాను. క్రచెస్‌ సహాయంతో నడిచేవాడిని. తరవాత నేను స్టార్‌ కావడానికి పదేళ్లు అవస్థలు పడ్డాను అమ్మకి ఇవ్వన్నీ తెలుసు. నేనెంత కష్టపడి ఎదిగానో తను చూస్తూనే ఉంది.

 

ఆర్కే: 1999కి ముందు చాలా స్ట్రగుల్‌ అయ్యారటగదా?

విక్రమ్‌: అవును. తెలుగులో హీరోగా చేశాను. 2 నెలలకు మలయాళం. తరవాత తెమిళం. డబ్బింగ్‌ చెప్పేవాడిని. క్షణక్షణం సినిమాకు తమిళంలో వెంకటేష్‌కు డబ్బింగ్‌ చెప్పాను. సత్య సినిమాకు చెప్పాను. రెండూ రామ్‌గోపాల్‌వర్మ సినిమాలే. తమిళంలో ప్రభుదేవా, వినీత, అబ్బాస్‌ అందరికీ డబ్బింగ్‌ చెప్పాను. డబ్బింగ్‌లో నేను ‘ది బెస్ట్‌’ అని చెప్పగలను. విపరీతంగా ప్రాక్టీస్‌ చేసేవాడిని. నాకు యాక్టింగ్‌ అంటే... 40 శాతం యాక్టింగ్‌. 60 శాతం డబ్బింగ్‌. పెద్దపెద్ద డైరెక్టర్స్‌తో చేసే అవకాశం రాలేదు..

 

ఆర్కే: ఎందుకని, మీకు టాలెంట్‌ ఉంది కదా?

విక్రమ్‌: అదే తెలియదు. ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవాకు వాయిస్‌ ఇచ్చాను. ఆ సినిమాలో యాక్ట్‌ చేయకపోయినా డైరెక్టర్‌ శంకర్‌తో కలిసి పనిచేశాను. ఆ సమయంలో చాలా నేర్చుకున్నాను. నా దృష్టిలో డబ్బింగ్‌ అనేది ఒక కళ.


ఆర్కే: అన్ని భావాలు, మాడ్యులేషన్స్‌ పలికించడం చిన్న విషయం కాదు

విక్రమ్‌: సేతు సినిమా తరవాత పాపులర్‌ కావడానికి చాలా వెయిట్‌ చేశాను. మూడు సినిమాలు హిట్‌ అయిన తరవాత కూడా నేను అబ్బాస్‌కు డబ్బింగ్‌ చెప్పాను.


ఆర్కే: స్టార్‌ అయిన తరవాత కూడా డబ్బింగ్‌ చెప్పారా?

విక్రమ్‌: అప్పటికి నేను అబ్బాస్‌ కంటే పెద్ద స్టార్‌నే. కానీ డబ్బులు అవసరం ఉంది కాబట్టి అన్నీ చేశాను. లైటింగ్‌, మేకప్‌, ఎడిటింగ్‌ విభాగాల్లో కూడా అందరికీ సహాయం చేస్తూ ఉంటాను. నా వరకూ ఈట్‌ సినిమా.... స్లీప్‌ సినిమా... డ్రీమ్‌ సినిమా.

 

ఆర్కే: అవకాశాలు రాకుండా దాదాపు పదేళ్ళు స్ట్రగుల్‌ అయ్యారు కదా. ఆ సమయంలో ఇంట్లో ఏ ఇబ్బంది ఎదురు కాలేదా?

విక్రమ్‌: ప్రేమించుకునేటప్పుడు ఒకసారి చెప్పాను. పెళ్ళి సమయంలో కూడా చెప్పాను.. నా మొదటి ప్రాధాన్యం సినిమా. తరవాతే నువ్వు, ఇక నువ్వే డిసైడ్‌ చేసుకోమన్నాను. తను కన్విన్స్‌ అయింది.

 

ఆర్కే: మీకు పరిచయం ఎప్పుడు జరిగింది?

విక్రమ్‌: నాకు యాక్సిడెంట్‌ అయినా తరవాత ఒక మ్యూట్యువల్‌ ఫ్రెండ్‌ ఇంట్లో కలిశాం. ఇప్పటిలా కాదు అప్పుడు. ఎప్పుడైనా కలిసినప్పుడు హలో.. హాయ్‌... చెప్పుకునేవాళ్ళం. సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు నా సినిమాలు ఫ్లాప్‌ అవుతూ ఉండేవి. ఈసారి వచ్చే సినిమా గ్యారెంటీగా హిట్‌ అని చెప్పేవాడిని. ఇలా పదేళ్ళు గడిచిపోయాయి. ఇక సేతు సినిమా రిలీజ్‌కు ముందు కూడా తను సందేహం వ్యక్తం చేసింది. ఇది లాస్ట్‌. ఇది హిట్‌ కాకపోతే నా దగ్గర కొద్దిగా డబ్బులున్నాయి. నేను కంప్యూటర్స్‌ నేర్చుకుంటాను. అమెరికాలో నా ఫ్రెండ్‌ ఉద్యోగం ఇస్తానన్నాడు అని చెప్పాను. కానీ సేతు సీన్‌ మొత్తం మార్చేసింది. తను ఒక సైకాలజిస్ట్‌. నాకు సినిమాలు అంటే ప్రేమ కాదు పిచ్చి అని అంటూ ఉంటుంది. సినిమాల నుంచి నేను బయటకు రావాలని తను దేవుడిని ప్రార్థించేదట. ఇప్పుడు నా పిక్చర్‌ వస్తే... తిరుపతి వెళ్ళాలని, ఫ్యాన్స్‌కి అది చేయాలి, ఇది చేయాలి అని తనే ముందుంటుంది.


ఆర్కే: ఆవిడ సైకాలజిస్టా?

విక్రమ్‌: అవును. ఇప్పుడు స్కూల్లో 11, 12 తరగతులకు టీచింగ్‌ చేస్తోంది. సోషల్‌ సర్వీస్‌ చేస్తుంది. బిఈడి చేయలేదు. తనకు టీచింగ్‌ అంటే చాలా ఇష్టం.

 

ఆర్కే: మీ యాక్టింగ్‌ గురించి ఆమె ఇప్పుడు ఏమంటారు?

విక్రమ్‌: నా దగ్గర చెప్పదు కానీ స్నేహితుల దగ్గర చెబుతుంది. నాతో చెప్పకపోయినా నన్ను చూసి చాలా గర్వంగా ఫీలవుతుందని మాత్రం చెప్పగలను.

 

ఆర్కే: ఇండసీ్ట్రకి హీరోగా సెటిల్‌ అవుదామని వచ్చారు కదా. చిన్న వయసులోనే పెళ్ళి చేసుకుంటే సమస్య అవుతుందని అనిపించలేదా?

విక్రమ్‌: లేదు. అవి రెండూ వేర్వేరు విషయాలు. నా దృష్టిలో సినిమా వేరు. జీవితం వేరు. నేను సెట్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ అసలు ముట్టుకోను. ఇంటి నుంచి ఫోన్‌ చేసినా సరే... నా అసిస్టెంట్‌కే చేయాలి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే. పిల్లలతో ఒక స్నేహితుడిగా, నా భార్యకు మంచి భర్తగా ఉండటానికే ఇష్టపడతాను. స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో ఒక స్టార్‌గా కాకుండా మామూలుగానే ఉంటాను.

 

ఆర్కే: సినిమా రంగంలో స్టార్‌డమ్‌ వచ్చిన తరవాత ఎవరూ ఇంత సింపుల్‌గా ఉండరు.

విక్రమ్‌: ఇంట్లో నా నిక్‌నేమ్‌ కెనీ. బయట ఉన్నప్పుడు నేను కెనీగానే ఉంటాను. సినిమాల్లోకి వచ్చినప్పుడు మాత్రం చియాన్‌ విక్రమ్‌నే.

 

ఆర్కే: ఈ చియాన్‌ విక్రమ్‌ ఏంటి?

విక్రమ్‌: సేతులో నా క్యారెక్టర్‌ పేరు చియాన్‌. ఆ సినిమా నా జీవితాన్నే మార్చింది. ఫ్యాన్స్‌ కూడా నన్ను చియాన్‌ అనే పిలుస్తారు.

 

ఆర్కే: ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్‌ ప్రయోగాత్మకంగా ఉంటుందా?

విక్రమ్‌: అవును. పెద్ద ఎక్స్‌పెరిమెంట్‌ అది. అదే నా మొదటి ప్రయోగం. ఆ క్యారెక్టర్‌ కోసం 15 కేజీలు బరువు తగ్గాను. రోజుకు ఒక చపాతీ, ఒక ఎగ్‌వైట్‌, కారెట్‌/ బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకునేవాడిని. అదీ రోజుకు ఒకసారి మాత్రమే. షూటింగ్‌ లొకేషన్‌కు రోజూ 16 కిలోమీటర్లు నడిచేవాడిని. ఐ సినిమాకు 25 కిలోలు తగ్గాను.

 

ఆర్కే: ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించదా?

విక్రమ్‌: డెఫినెట్‌గా చూపిస్తుంది. సేతు సినిమా ఆరోగ్యంపై ప్రభావం బాగా చూపించింది. అప్పట్లోలా కాకుండా ఇప్పుడు ఏదిచేసినా సైంటిఫిక్‌గా చేస్తున్నాను. ఎక్సర్‌సైజ్‌లు, డైట్‌ అన్నీ జాగ్రత్తగా చేస్తున్నాను. ఐ సినిమా కోసం బాగా కష్టపడ్డాను. క్యారెక్టర్‌ కోసం ఏదైనా ఇష్టంగా చేయడానికి నేను సిద్ధం. డైరెక్టర్‌ శంకర్‌ వద్దని వారించినా కాదని, నాకు తృప్తి ఉంటుందని చెప్పి ఆయన్ను ఒప్పించాను.


ఆర్కే: ఈ క్యారెక్టర్స్‌ అన్నీ డిఫరెంట్‌ డిజైన్స్‌, ఎక్స్‌పెరిమెంట్స్‌ కదా. వీటిలో మీ ఆసక్తి ఉంటుందా? డిజైన్‌ చేసిన క్యారెక్టర్స్‌కు మిమ్మల్ని ఎంపిక చేసుకుంటున్నారా?

విక్రమ్‌: ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతుంటాయి. అభిమానులు నా నుంచి ఎక్కువ ఆశిస్తుంటారు. అందుకు తగిన పాత్రలు ఎంచుకోవాలి.

 

ఆర్కే: ఒక్కొక్కడు సినిమాలో రెండు క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. ఒకటి డైరెక్ట్‌గా మీరే కనబడతారు, రెండోది డిఫరెంట్‌గా ఉంటుంది.

విక్రమ్‌: మామూలుగా డ్యూయల్‌ రోల్‌ ఉన్న సినిమాల్లో ట్విన్స్‌, తండ్రి కొడుకులు ఇలా ఉంటుంది. కానీ దీంట్లో విక్రమ్‌ ఒక క్యారెక్టర్‌. రెండోది నేనే అని గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంటుంది.

 

ఆర్కే: ఆ క్యారెక్టర్‌కు నెయిల్‌ పాలిష్‌ వేసుకున్నారేంటి?

విక్రమ్‌: ఆ క్యారెక్టర్‌ అలాంటిది. అది వేరే స్టైల్‌. ఒక రా ఏజెంట్‌. ఏదైనా ప్రాబ్లం అంటే ఫస్ట్‌ కొట్టేస్తారు. తరవాత అడుగుతారు.

 

ఆర్కే: ట్రయలర్‌ చూస్తే గే లాగా అనిపిస్తోంది.

విక్రమ్‌: ఆయన డ్రస్సింగ్‌ స్టైల్‌, మాట్లాడే విధానం అలా అనిపిస్తాయి. ఆడియన్స్‌లో ఆసక్తిని పెంపొందించడమే టీజర్‌ రిలీజ్‌ వెనక ఉన్న ఆలోచన.

 

ఆర్కే: ఆ క్యారెక్టర్‌ను క్రియేట్‌ చేసింది ఎవరు?

విక్రమ్‌: డైరెక్టర్‌ చేశారు.


ఆర్కే: ఒక విషయం క్లియర్‌ చేయండి. మీకోసం క్యారెక్టర్లు క్రియేట్‌ అవుతున్నాయా? క్యారెక్టర్‌ కోసం...

విక్రమ్‌: ఈ పిక్చర్‌ నాకోసమే చేశారు. డైరెక్టర్‌ కథ చెప్పినప్పుడు నన్ను హీరో పాత్ర వరకే అనుకున్నారు. కానీ కథ విన్న తరవాత విలన్‌గా కూడా నేనే చేస్తానని అడిగాను.


ఆర్కే: డబ్బు విషయంలో మీకు అంత పట్టింపు లేదేమో అనిపిస్తుంది?

విక్రమ్‌: నేను చాలా సినిమాలు ఫ్రీగా చేశాను. ఒక సినిమాకు మూడు సంవత్సరాలు అసలు షూటింగ్‌ లేకపోయినా అలాగే వెయిట్‌ చేశాను. ఒక్కరోజు షూటింగ్‌ జరిగితే 20, 30 రోజులు ఇంట్లోనే. ఐ సినిమాకు మూడేళ్ళు, రావణన్‌ 2 సంవత్సరాలు, అపరిచితుడు 18 నెలలు పట్టింది. డబ్బు మాత్రమే కావాలనుకుంటే ఐదారు నెలల్లో ఒక సినిమా అయిపోతుంది. కానీ అది నాకు ఇష్టం ఉండదు. ఒక్కో క్యారెక్టర్‌ లుక్‌ కోసమే నాకు 2, 3 నెలలు పడుతుంది.


ఆర్కే: ఆ సమయంలో వేరే సినిమా చేయడానికి కూడా మీ బాడీ సహకరించదేమో?

విక్రమ్‌: అవును. నా సినిమాకు సంబంధించి ఏ ఫొటో చూసినా అది ఏ సినిమాకు సంబంధించిందో చెప్పేయగలగాలి. అలా ఉంటాయి నా క్యారెక్టర్లు. లేకపోతే నాకే కోపం వచ్చేస్తుంది.

 

ఆర్కే: అంటే మూడు సినిమాలు చేయడానికి మీకు ఆరేళ్ళు పట్టిందా?

విక్రమ్‌: అవును. నేను చేసిన అన్ని సినిమాలు దాదాపు అంతే.

 

ఆర్కే: కమర్షియల్‌గా చూస్తే చాలా లాస్‌ కదా?

విక్రమ్‌: డెఫినెట్‌గా నాకు పెద్ద లాస్‌ అది. కానీ నేను పొందిన గౌరవం, ఆనందంతో పోలిస్తే అదేమంత పెద్ద విషయం కాదు. నేను చేసిన క్యారెక్టర్లను ప్రజలు బాగా రిసీవ్‌ చేసుకున్నారు.

 

ఆర్కే: అందుకేనా మణిరత్నం చేసిన బాంబే సినిమాను కూడా వదులుకున్నారు?

విక్రమ్‌: నేను వదలుకోలేదు. ఆయనే నన్ను వదిలేశారు. అయినా ఇది మీకు ఎలా తెలుసు? బాగానే హోం వర్క్‌ చేసినట్లున్నారు. ఆ సమయంలో వేరే సినిమాకు కమిట్‌ అయ్యాను. అందులో నాకు గడ్డం ఉంటుంది, జుట్టు పొడవుగా ఉంటుంది. కానీ ఆయనకు క్లీన్‌ లుక్‌ కావాలి. అది రాలేదు. శంకర్‌, మణిరత్నంగారి డైరెక్షన్‌లో సినిమా చేయాలనేది నా కల. ఆ సినిమాలో సెలక్ట్‌ కాకపోవడం నా జీవితంలో పెద్ద లాస్‌.

 

ఆర్కే: అదీ షేవ్‌ చేసుకోకపోవడం వల్ల?

విక్రమ్‌: తరవాత సినిమా ఎప్పుడు షూటింగ్‌ ఉందో తెలియదు. దానికోసం పెంచిన గడ్డం, జుట్టు తీసేయడానికి నేను ఒప్పుకోలేదు. స్నేహితుల మాట కూడా వినలేదు. ఎందుకు అలా చేశానా అని తరవాత చాలా బాధపడ్డాను.

 

ఆర్కే: తరవాత మళ్ళీ మణిరత్నం గారిని ఎప్పుడైనా అడిగారా?

విక్రమ్‌: రావణన్‌ చేశా కదా. తరవాత కూడా మేమిద్దరం మంచి టచ్‌లో ఉన్నాం. ఆయన నాకు దేవుడితో సమానం. బాంబే సినిమా సమయానికి నేను ఏదో టెన్షన్‌లో ఉన్నాను. అప్పటికి ఇంత పరిపక్వత కూడా లేదు. అప్పటికి నేను స్టార్‌ని కూడా కాదు.

 

ఆర్కే: సినిమాలో ఫైట్స్‌ విషయంలో మీ ప్రత్యర్థుల సహకారం ఎలా ఉంటుంది?

విక్రమ్‌: శివపుత్రుడులో టీ షాప్‌లో ఒక ఫైట్‌ ఉంది. మీరు ఆ ఫైట్‌ చూడొచ్చు. ఎంత రియల్‌గా ఉంటుందో. నా గోరు కూడా ఊడిపోయింది. రియల్‌ గొడవలా ఉంటుంది. ఇలాంటివి చేయనప్పుడు ఎంత చేసినా అనవసరం.

 

ఆర్కే: ఇలాంటివి రిస్కీ ఫైట్స్‌ చేసేటప్పుడు మీ కాలుతో సమస్య ఏమీ రాదా?

విక్రమ్‌: వస్తుంది. కానీ పట్టించుకోను. మంటలు అంటే నాకు భయం. అపరిచితుడు సినిమాలో ఒక ఫైట్‌లో మంటల మధ్య నుంచి దూకే సీన్‌ ఉంది. అలాగే చేసేశాను. బోనులో సింహాన్ని ఉంచి లోపలకు వెళ్లి సీన్‌ చేయాలంటే వెళ్లిపోతాను. రావణ్‌ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌లో బ్రిడ్జ్‌పై నుంచి మూడు వేల మీటర్ల కిందకు పడే సన్నివేశం చేశాం. ఒకసారి డైరెక్టర్‌ యాక్షన్‌ చెప్పిన తరవాత ఆ మూడ్‌లోకి వెళ్లిపోతాను.

 

ఆర్కే: ఇంత రిస్క్‌ తీసుకుంటున్నప్పుడు మీ భార్య ఏమీ అభ్యంతరం చెప్పరా?

విక్రమ్‌: నేను వినను. చెప్పినందువల్ల ఉపయోగం లేదు. వాళ్ళూ విసిగిపోయి వదిలేశారు. కనీసం అడగడం కూడా మానేశారు. ఐ సినిమా సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు కనీసం నన్ను చూడలేకపోయేవారు.

 

ఆర్కే: ఇన్ని క్యారెక్టర్లు వేశారు. ఇన్ని అవార్డులు వచ్చిన తరవాత కూడా మీ నాన్నగారు తానే గ్రేట్‌ ఆర్టిస్ట్‌, మీరు కాదు అంటున్నారా?

విక్రమ్‌: అదేం లేదు. ఆయన నన్ను చూసి గర్వపడతారు. కానీ లోపల నేను గొప్ప నటుణ్ణి, నా తరవాతనే నువ్వు వచ్చావనే భావన ఆయనకు ఉంది.


Updated Date - 2020-02-08T08:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising