ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్‌జీ ఇండియా వచ్చేసిందా.. ఆన్‌లైన్‌ లింకులేంటి..?

ABN, First Publish Date - 2020-12-15T19:08:51+05:30

‘మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పబ్‌జీ ఇండియా వచ్చేసింది. ఇదిగో ఈ లింకుపై క్లిక్ చేయండి. పబ్‌జీ ఇండియా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని ఇక గేమ్ ఆడేయండి’ ఇలాంటి లింకులు మనం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తరచూ చూస్తున్నాం. అత్యధిక శాతం యువత ఈ లింకులపై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకునేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ‘మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పబ్‌జీ ఇండియా వచ్చేసింది. ఇదిగో ఈ లింకుపై క్లిక్ చేయండి. పబ్‌జీ ఇండియా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. గేమ్ ఆడేయండి’ ఇలాంటి లింకులు మనం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తరచూ చూస్తున్నాం. అత్యధిక శాతం యువత ఈ లింకులపై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే ఇది సిల్లీగా అనిపించినా.. ఇందులో ఎంత ప్రమాదం దాగి ఉందో మీకు తెలుసా..? ప్రపంచంలోనే పబ్‌జీ ఫేమస్ అయినంతగా వేరే ఏ గేమ్ కూడా పాపులర్ కాలేదంటే అతిశయోక్తి కాదు. యువతను అంతలా కట్టిపడేసింది ఈ మొబైల్ గేమ్. అయితే చైనా సర్వర్లలో పబ్‌జీ డేటా స్టోర్ అవుతుండడంతో భారత్ ఈ గేమ్‌ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేసింది. అయితే ఇప్పుడు ఈ గేమ్‌ను తిరిగి భారత్‌లోకి తీసుకొచ్చేందుకు పబ్‌జీ విశ్వ ప్రయత్నం చేస్తోంది.


పబ్‌జీ దక్షిణ కొరియాకు చెందిన గేమ్ అయినప్పటికీ.. ఈ గేమ్ మొబైల్ వెర్షన్‌లో చైనాకు చెందిన టెన్‌సెంట్ కంపెనీకి వాటా ఉంది. దీంతో నిషేధం ఎదుర్కొన్న పబ్‌జీ మళ్లీ అడుగుపెట్టేందుకు చైనా నుంచి సర్వర్లను కూడా తొలగించేసింది. పబ్‌జీ ఇండియా పేరుతో కొత్త వెర్షన్‌ను సైతం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో ఈ గేమ్ మళ్లీ భారతీయ యువత చేతుల్లోకి వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో కొంతమంది కేటుగాళ్లు యువతను మోసం చేసేందుకు రెడీ అవుతున్నారు. పబ్‌జీ ఇండియా అప్లికేషన్ వచ్చేసిందని, దానికి సంబంధించిన ఏపీకే(అప్లికేషన్ ఫైల్)ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కొన్ని లింకులను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇది నిజమే అనుకుని కొంతమంది వాటిపై క్లిక్ చేసస్తున్నారు. కానీ గేమ్ డౌన్‌లోడ్ కాకపోవడంతో వదిలేస్తున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన మోసం జరిగిపోయి ఉంటుంది. క్లిక్ చేసిన లింక్‌లో అప్పటికే కేటుగాళ్లు ప్రమాదకరమైన మాల్వేర్‌ను సెట్ చేసి ఉంటారు.


కంప్యూటర్ లేదా మొబైల్‌ ద్వారా ఆ లింక్‌పై క్లిక్ చేయగానే అది యాక్టివేట్ అవుతుంది. మీ ప్రయేయం లేకుండానే కొన్ని రహస్య యాప్‌లు సాఫ్ట్‌వేర్‌లోకి వచ్చి చేరతాయి. అంతే మీ డేటా మొత్తం ఆ కేటుగాళ్ల చేతికి సులభంగా చేరిపోతోంది. ఇంకా మాట్లాడితే మీరే మీ డేటాను వారికి అందించినట్లవుతుంది. మీ పర్సనల్ డేటాను చోరీ చేసి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల పబ్‌జీ ఇండియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి, పబ్‌జీ ప్రధాన సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇలాంటి ఆన్‌లైన్ లింకులను నమ్మకండి. మిమ్మల్ని మీరే కష్టాల్లోకి నెట్టుకోకండి. తస్మాత్ జాగ్రత్త!

Updated Date - 2020-12-15T19:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising