బాహు బాలిక! 80 కిలోలు ఎత్తింది
ABN, First Publish Date - 2020-12-11T09:09:33+05:30
రోరీ వాన్ ఉల్ట్..వయస్సు ఏడేళ్లు. ఎత్తు నాలుగడుగులు. కానీ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈ చిన్నారి సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల 30 కిలోల విభాగంలో యూఎస్ అండర్-11, అండర్-13 టైటిళ్లు అందుకున్న ఉల్ట్...
న్యూఢిల్లీ : రోరీ వాన్ ఉల్ట్..వయస్సు ఏడేళ్లు. ఎత్తు నాలుగడుగులు. కానీ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈ చిన్నారి సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల 30 కిలోల విభాగంలో యూఎస్ అండర్-11, అండర్-13 టైటిళ్లు అందుకున్న ఉల్ట్..అత్యంత పిన్నవయస్సు అమెరికా యూత్ నేషనల్ చాంపియన్‌గా రికార్డు సృష్టించింది. ఆ ఉత్సాహంతో ఉల్ట్.. డెడ్‌లి్‌ఫ్టలో ఏకంగా 80 కిలోలు ఎత్తి ప్రపంచం నోరెళ్లబెట్టేలా చేసింది. ఒలింపిక్ మహిళల బార్‌ను ఉపయోగించిన రోరీ..స్నాచ్‌లో 32 కిలోలు, జెర్క్‌లో 42 కిలోలతోపాటు స్క్వాట్‌లో 61 కిలోల బరువెత్తింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉల్ట్ లిఫ్ట్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు ‘బాహు బాలిక’ అని ఆమెను ప్రశంసిస్తున్నారు.
Updated Date - 2020-12-11T09:09:33+05:30 IST