ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఏడాది ఐపీఎల్ అప్పుడే: తేల్చి చెప్పిన గంగూలీ

ABN, First Publish Date - 2020-11-08T02:26:19+05:30

కరోనా వైరస్ కారణంగా భారత్‌లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా భారత్‌లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలిపోయాయి. సాధారణంగా ఏప్రిల్-మే మధ్య జరగాల్సిన పోటీలు కరోనా మహమ్మారి కారణంగా సెప్టెంబరు మూడో వారంలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 10తో సీజన్ ముగియనుండగా, వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్‌పై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ ఇప్పుడే ముగుస్తుండడంతో వచ్చే ఏడాది కూడా పోటీలు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆ ఊహాగానాలకు తెరదించాడు. ఐపీఎల్-14 ఎప్పటిలానే ఏప్రిల్-మే మధ్యలోనే ప్రారంభం అవుతుందని స్పష్టం చేశాడు. అంతేకాదు, ఈసారి వేదిక మార్పు ఉండబోదని, ఇండియాలోనే జరుగుతాయని చూచాయగా చెప్పాడు. అలాగే, ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుందని, దేశవాళీ పోటీలు కూడా నిర్వహిస్తామని, ఇందుకోసం బయోబబుల్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇక భయం లేదని, ఐపీఎల్ ఎంతగానో సాయపడిందని పేర్కొన్నాడు.  

Updated Date - 2020-11-08T02:26:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising