ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అథ్లెట్‌ కిరణ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం

ABN, First Publish Date - 2020-05-30T09:02:06+05:30

భారత మహిళల లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ కిరణ్‌జీత్‌ కౌర్‌పై వేటు పడింది. గతేడాది కోల్‌కతా 25కె రేసు సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో ఆమె నిషేధిత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత మహిళల లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ కిరణ్‌జీత్‌ కౌర్‌పై వేటు పడింది. గతేడాది కోల్‌కతా 25కె రేసు సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు రుజువైంది. బి శాంపిల్‌ కూడా పాజిటివ్‌గా తేలడంతో 32 ఏళ్ల కౌర్‌పై నాలుగేళ్ల నిషేధం విధిస్తూ ప్రపంచ అథ్లెటిక్స్‌ డోపింగ్‌ నిరోధక సంస్థ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. హరియాణాకు చెందిన కిరణ్‌ గతేడాది డిసెంబరులో జరిగిన టాటా స్టీల్‌ కోల్‌కతా 25కె రేసులో స్వర్ణం సాధించింది. తాజా నిర్ణయంతో ఆమె నుంచి స్వర్ణాన్ని వెనక్కి తీసుకోనున్నారు. ఆమెపై నిషేధం నిరుడు డిసెంబరు 15 నుంచి మొదలుకానుంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆమె శాంపిల్‌ ఎ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అయితే దోహాలో నిర్వహించిన బి శాంపిల్‌ పరీక్షలో కూడా పాజిటివ్‌ రావడంతో ఆమెపై వేటు తప్పలేదు. కిరణ్‌ గతేడాది మార్చిలో పటియాల వేదికగా జరిగిన ఫెడరేషన్‌ కప్‌ జాతీయ అథ్లెటిక్స్‌లో 10వేల మీటర్ల రేసులో కాంస్యం సాధించింది.

Updated Date - 2020-05-30T09:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising