ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెంబర్‌ వన్‌కు షాకిచ్చి..ఫైనల్‌ చేరిన హంపి

ABN, First Publish Date - 2020-07-18T09:01:53+05:30

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప 4వ గ్రాండ్‌ ప్రీలో అదరగొట్టింది. ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి హో యిఫాన్‌ (చైనా)ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నె: తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప 4వ గ్రాండ్‌ ప్రీలో అదరగొట్టింది. ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి హో యిఫాన్‌ (చైనా)ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకె ళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌ పోరులో హంపి 6-5తో యిఫాన్‌పై సంచలన విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన హంపి తొలి గేమ్‌ను సునాయాసంగానే దక్కించుకొంది. ఆ తర్వాత యిఫాన్‌ కూడా పుంజుకోవడంతో తర్వాతి గేమ్‌లు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. ఆదివారం జరిగే 4వ గ్రాండ్‌ ప్రీ ఫైనల్లో రష్యా స్టార్‌ క్రీడాకారిణి అలెక్సాండ్రా కోస్తానిక్‌తో హంపి అమీతుమీ తేల్చుకోనుంది. స్పీడ్‌ చెస్‌లో ఇప్పటివరకు జరిగిన మొత్తం మూడు గ్రాండ్‌ ప్రీ టోర్నీల్లో హంపి మొదటిదాంట్లో తొలి రౌండ్లోనే ఓడింది. రొటేషన్‌ పద్ధతిలో భాగంగా రెండో గ్రాండ్‌ ప్రీలో ఆమె ఆడలేదు. మూడో గ్రాండ్‌ ప్రీలో క్వార్టర్స్‌లో ఓడిన హంపి.. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టోర్నీలో ఫైనల్‌ చేరింది. మొత్తం నాలుగు గ్రాండ్‌ ప్రీ టోర్నీల్లో పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణుల మధ్య ఈనెల 20న సూపర్‌ ఫైనల్‌ జరగనుంది.

Updated Date - 2020-07-18T09:01:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising