ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ విపత్తు ముగిసిన తర్వాత క్రికెట్‌లో పెద్దగా మార్పులుండవు: గంభీర్

ABN, First Publish Date - 2020-05-10T21:46:50+05:30

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ విపత్తు ముగిసి.. పరిస్థితులు సామాన్య స్థితి వచ్చే సమయానికి క్రికెట్‌లో పెద్దగా మార్పులు ఉండవి టీం ఇండియా మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ విపత్తు ముగిసి.. పరిస్థితులు సామాన్య స్థితి వచ్చే సమయానికి క్రికెట్‌లో పెద్దగా మార్పులు ఉండవి టీం ఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. బంతిని షైన్ చేసేందుకు ఉమ్మిని ఉపయోగించడాన్ని నిషేధం దానికి బదులుగా ఏదైనా కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించాలని ఐసీసీ భావిస్తోంది. 


ఈ విషయంలో ఏకీభవించిన గంభీర్.. క్రికట్‌లోని నిబంధనల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని గంభీర్ తెలిపారు. ‘‘క్రికెట్‌లోని నియమ, నిబంధనల్లో మార్పులు ఉంటాయని నేను అనుకోవడం లేదు. కేవలం ఉమ్మి వాడకానికి బదులు మరో వస్తువు అమలులోకి రావొచ్చు కానీ.. ఎక్కువగా మార్పులు జరుగుతాయని నేను అనుకోవడం లేదు. సామాన్య ప్రజలతో పాటు.. ఆటగాళ్లు కూడా వైరస్‌తో కలిసే జీవించాలి. ప్రతీ ఒక్కరు అందుకు అలవాటు పడిపోవాలి. కొందరు ఆటగాళ్లకు వైరస్ కూడా సోకవచ్చు. కానీ, దానితో కలిసి జీవించడం మాత్రం ఎవరికీ తప్పదు’’ అని గంభీర్ అన్నారు. 


అయితే భౌతిక దూరం పాటించడం క్రికెట్‌లో సాధ్యమవుతుంది కానీ, ఇతర క్రీడల్లో అది వీలుపడదని గంభీర్ తెలిపారు. ‘‘భౌతిక దూరం పాటించడం క్రికెట్‌లో సాధ్యమవుతుంది. కానీ, ఫుట్‌బాల్, హకీ వంటి క్రీడల్లో అది అసాధ్యం. కాబట్టి.. దాని గురించి ఆలోచించడం బదులు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిదని గంభీర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-10T21:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising