15 స్థానాలు..86 జట్లు
ABN, First Publish Date - 2020-12-15T06:01:50+05:30
పురుషుల టీ20 ప్రపంచకప్ (2022) క్వాలిఫయింగ్ పోటీలకు సంబంధించిన వివరాలను ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే 15 జట్లను అర్హత పోటీల ఆధారంగా తేల్చనున్నారు...
- టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్
దుబాయ్: పురుషుల టీ20 ప్రపంచకప్ (2022) క్వాలిఫయింగ్ పోటీలకు సంబంధించిన వివరాలను ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే 15 జట్లను అర్హత పోటీల ఆధారంగా తేల్చనున్నారు. క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 86 జట్లు 13 నెలలపాటు 225 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. వచ్చే ఏప్రిల్‌లో మొదలయ్యే క్వాలిఫయింగ్ టోర్నీ 5 రీజియన్ల (ఆఫ్రికా, అమెరికా, ఈస్ట్ ఏషియా పసిఫిక్ (ఈఏపీ), యూరప్, ఆసియా)లో 4 దశల్లో జరగనుంది.
Updated Date - 2020-12-15T06:01:50+05:30 IST