ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వేకు తెలంగాణ బకాయిలు 499 కోట్లు

ABN, First Publish Date - 2020-03-19T10:27:13+05:30

తెలంగాణాలో చేపడుతున్న ఆయా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద కేంద్రానికి రూ.499 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర రైల్వే మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైకి హైస్పీడు రైలు: పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణాలో చేపడుతున్న ఆయా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద కేంద్రానికి రూ.499 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. దీని వల్ల భూసేకరణతో పాటు అటవీ, వన్యప్రాణి విభాగాల అనుమతుల్లో ఆలస్యం కారణంగా అనేక ప్రాజెక్టులు పూర్తి కావడంలో జాప్యం జరుగుతున్నదని లోక్‌సభలో వివరించారు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


రాష్ట్రం లో రూ.20,226కోట్లతో 13 ప్రాజెక్టుల ద్వారా 1,604 కిలోమీటర్ల మేర లైన్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. వీటికి మార్చి 2019 వరకూ రూ.3,037 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. బీబీనగర్‌-విష్ణుపురం లైను డబ్లింగ్‌ పనులకు డీపీఆర్‌ రూపొందిస్తున్నామన్నారు. 

Updated Date - 2020-03-19T10:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising