ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు హాజరైన ప్రజా ప్రతినిధులు

ABN, First Publish Date - 2020-10-13T02:18:46+05:30

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిప్రజానిధులపై కేసుల విచారణ వేగంగా కొనసాగుతోంది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిప్రజానిధులపై కేసుల విచారణ వేగంగా కొనసాగుతోంది. దీంతో నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు కోర్టుకు హాజరవుతున్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. 


గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సాక్షుల వాంగ్మూల నమోదును కొనసాగించేందుకు షెడ్యూలు ఖరారు చేసింది.  ఈ నెల 19న కర్ణాటక ఎమ్మెల్యే శ్రీరాములు వాంగ్మూలం నమోదు చేయాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. 


మద్యం కుంభకోణం కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మద్యం వ్యాపారుల నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్టు మోపిదేవిపై ఏసీబీ అభియోగం మోపింది. ఈ నెల 19 నుంచి విచారణకు షెడ్యూలు ఖరారు చేసింది. 


ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. 


Updated Date - 2020-10-13T02:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising