ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదో తరగతి పరీక్ష సెంటర్లకు శానిటైజర్లు

ABN, First Publish Date - 2020-06-06T11:15:18+05:30

ఈనెల 8 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 5: ఈనెల 8 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి సెంటర్లకు శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్‌వాష్‌, క్లీనర్స్‌ను డిస్టిబ్యూట్‌ చేశారు. అంతేకాకుండా సెక్టోరల్‌ అధికారుల నేపథ్యంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ మిషన్‌ను వారికే పరీక్షించారు. పరీక్షలు ప్రారంభ మయ్యే రోజున ప్రతీ ఒక్కరు వీటిని విధిగా వినియోగించిన తర్వాతనే లోనికి అనుమతించాలని పాఠశాల యాజమాన్యాలను కోరారు. ఇందులో సెక్టోరల్‌ అధికారులు నర్సయ్య, శ్రీనివా్‌సరెడ్డి తదితరులున్నారు.


త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో పాల్గొననున్న విద్యార్థులకు శుక్రవారం డాక్టర్‌ నవీన్‌రెడ్డి  కోవిడ్‌ పరీక్షలు నిర్వహిచారు. బోథ్‌లోని ఎస్‌టీ బాలుర వసతి గుృహంతో పాటు పలు గ్రామాల్లోని విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు జరిపారు. 


ఈనెల 8నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల కోసం హాజరు అవుతున్న విద్యార్థులకు ఉట్నూర్‌ మండలంలో వైద్య ఆరోగ్య శాఖ అదికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం స్థానిక కుమ్రం బీం ప్రాంగణంలోని క్రీడా పాఠశాల, లాల్‌టెకిడి గురుకుల పాఠశాలల్లో  పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులకు హస్నాపూర్‌ పిహెచ్‌సీ డాక్టర్‌  విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కరోనా ఉందని ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రతీ విద్యార్థి మాస్క్‌లు ధరించి శానిటెజర్‌లు ఉపయోగించాలని సూచించారు. 

Updated Date - 2020-06-06T11:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising