ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దలకు ‘స్వయంవరం’

ABN, First Publish Date - 2020-03-16T08:37:12+05:30

పెద్దల స్వయంవరం.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ, ఎల్డర్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌, తోడు నీడ, అనుబంద్‌ ఫౌండేషన్‌, సాకేత్‌ ఇంజనీరింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

50-90 వయస్కులు హాజరు

హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహణ

కవాడిగూడ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పెద్దల స్వయంవరం.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ, ఎల్డర్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌, తోడు నీడ, అనుబంద్‌ ఫౌండేషన్‌, సాకేత్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తాధ్వర్యంలో తొలిసారి హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో నిర్వహించిన పెద్దల స్వయంవరానికి విశేష స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పెద్దలు హాజరయ్యారు. 50-90 ఏళ్ల వయసున్న పెద్దల్లో అసలు పెళ్లి కానివారు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారు దాదాపు 400 మంది వరకు వచ్చారు.


భర్త మోసగించిన మహిళలు, భార్యను కోల్పోయిన భర్తలు, భార్య మోసగించిన భర్తలు, భార్యలు చనిపోవడంతో పిల్లలు పట్టించుకోని వారు పాల్గొని తమ సహచరులు ఎలా ఉండాలో అభిప్రాయాలు తెలియజేశారు. కౌన్సెలింగ్‌ తర్వాత వివాహ ఒప్పంద తేదీని నిర్ణయించి, రిజిస్ర్టార్‌ సహాయంతో ఉచితంగా పెళ్లి చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ.. ఒక వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయిన స్త్రీలు, పురుషులు ఒంటరిగా జీవించలేక ఎంతో బాధ పడుతుంటారని చెప్పారు. అలాంటి పెద్దలు నిస్సంకోచంగా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.


స్వయంవరంలో  ఒక్కటైన జంట

ఇరిగేషన్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైరైన ఈశ్వర్‌ ప్రసాద్‌ (64), విజయ అనే మహిళను ఇష్టపడ్డారు. ఈశ్వర్‌ప్రసాద్‌ రెండేళ్లుగా ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థలో సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కటైన ఆ జంటను అతిథులు అభినందించారు.

Updated Date - 2020-03-16T08:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising