ఏఎస్‌రావు నగర్‌లో పుర్రె, ఎముకల కలకలం
ABN, First Publish Date - 2020-12-30T12:24:35+05:30
ఏఎస్‌రావు నగర్‌లో పుర్రె, ఎముకల కలకలం

హైదరాబాద్ : భాగ్యనగరంలోని ఏఎస్‌రావునగర్ డివిజన్ రాధికా చౌరస్తా సమీపంలోని ఓ బహుళ అంతుస్తుల వాణిజ్య సముదాయం భవనంపైన మట్టికుప్పలో పుర్రె, ఎముకలు లభ్యమైయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రాధికా చౌరస్తాలోని వర్టెక్స్ కాంప్లెక్స్ భవనంపై కొన్నేళ్లుగా మట్టి కుప్ప ఉంది. దాంతో తరచూ స్లాబ్‌లో లీకేజీ సమస్య తలెత్తుతుంది. కాంప్లెక్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కూలీలతో మట్టికుప్పలను తొలగిస్తున్నారు. మట్టి కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి. కూలీలు వెంటనే అసోసియేషన్ ప్రతినిధులకు తెలియజేశారు. అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ మన్మోహన్, ఎస్సై అనంతచారి ఘటన స్థలానికి చేరుకొని పుర్రె, ఎముకలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ లాబ్‌కు పంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-30T12:24:35+05:30 IST