ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్... భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తావా?

ABN, First Publish Date - 2020-11-18T23:21:58+05:30

గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయం నిలిపివేయడంపై అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయం నిలిపివేయడంపై అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. వరద సాయాన్ని బీజేపీనే ఆపించిందని ఛార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయంలో కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు. అలాగే వరద సాయాన్ని బీజేపీ ఆపించలేదని భాగ్యలక్ష్మీ దేవాలయంలో తాను కూడా ప్రమాణం చేస్తానని బండి సంజయ్ సవాల్ విసిరారు.


సంతకాన్ని ఫోర్జరీ చేశారు..

వరద సాయాన్ని ఆపాలని ఎస్ఈసీకి తాను లేఖ రాయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీనే ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయం బీజేపీ ఆపిందన్న సీఎం  కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. క్యూలో నిలుచున్న మహిళ మరణించడం ప్రభుత్వ హత్యేనని తెలిపారు. కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో దేశ ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తొత్తుగా మారిందని విమర్శించారు. ఈరోజు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు.


మరో వైపు వరద సాయాన్ని ఆపేయమంటూ కాంగ్రెస్ చెప్పలేదని ఆ పార్టీ నేత దాసోజ్ శ్రవణ్ తెలిపారు. తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-11-18T23:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising