పాడె మోసి ప్రచారం చేసుకుంటున్నారు
ABN, First Publish Date - 2020-04-22T10:08:05+05:30
తన తండ్రి పాడె మోసిన ఐదుగురు.. దానిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారంటూ ఓ బాలుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు
ఐదుగురిపై పోలీసులకు బాలుడి ఫిర్యాదు
బంజారాహిల్స్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): తన తండ్రి పాడె మోసిన ఐదుగురు.. దానిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారంటూ ఓ బాలుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వేణు 4రోజుల క్రితం మృతి చెందాడు. అంత్యక్రియలకు హాజరైన మాజీద్, సాదిక్‌బిన్ సలాం, అబ్దుల్ ఖాదీన్, అహ్మద్, షేక్ ఖాసీం..ఈ తతంగాన్నంతా తామే నిర్వహించామంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టారు. ఇలా తప్పుడు ప్రచారంతో తమ మనోభావాలు దెబ్బతీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుమారుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-04-22T10:08:05+05:30 IST