ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సివిల్‌ ఇంజనీర్ల భర్తీకి ఆమోదం...

ABN, First Publish Date - 2020-11-06T12:45:17+05:30

జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి వంద మంది సివిల్‌ ఇంజనీర్లను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయడానికి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. బీటెక్‌ పూర్తయిన సివిల్‌ ఇంజనీర్లను ఏడాది పాటు పని చేయడానికి న్యాక్‌ ద్వారా భర్తీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌  : జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి వంద మంది సివిల్‌ ఇంజనీర్లను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయడానికి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. బీటెక్‌ పూర్తయిన సివిల్‌ ఇంజనీర్లను ఏడాది పాటు పని చేయడానికి న్యాక్‌ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. దీంతో పాటు ఉద్యోగుల పదోన్నతులు, రిటైర్డ్‌ ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌లో కొనసాగింపు, పలు ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు వంటి 9 అంశాలపై చర్చించింది. సమావేశంలో కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు గంధం జ్యోత్న్స, ముద్రబోయిన శ్రీనివాసరావు, జువేరియా ఫాతిమా, మీర్‌ బాసిత్‌ అలీ, సామ స్వప్న, మీర్జా ముస్తఫా బేగ్‌, సున్నం రాజ్‌మోహన్‌, ముఠా పద్మనరేష్‌, కొలను లక్ష్మి, వీ.సింధు, సబితా కిషోర్‌, ధనంజన భాయ్‌,  అరుణ, జోనల్‌ కమిషనర్లు ఉపేందర్‌ రెడ్డి, మమత, శ్రీనివా్‌సరెడ్డి, అశోక్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి  పాల్గొన్నారు.

Updated Date - 2020-11-06T12:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising