ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2020-07-20T18:14:06+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గవర్నర్ తమిళిసైను కలవనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గవర్నర్ తమిళిసైను కలవనున్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. కరోనా విషయంలో గవర్నర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. కరోనా బాధితుల విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కేసుల విషయంలో గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.


సీఎం కేసీఆర్ కరోనా విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇవాళ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా నివారణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, చికిత్సకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసిందన్న అంశాలపై గవర్నర్‌కు కేసీఆర్ వివరించనున్నారు. అలాగే మరో రెండు, మూడు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి కొత్త డిజైన్‌పై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రెండు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయ్యాయి. వాటి భర్తీ విషయంపై అభ్యర్థుల పేర్లు కూడా గవర్నర్‌కు ముఖ్యమంత్రి సిఫార్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ అంశాలన్నింటిపై సీఎం కేసీఆర్ గవర్నర్‌తో చర్చించనున్నారు.

Updated Date - 2020-07-20T18:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising