ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలపై కరోనా ఎఫెక్ట్‌!

ABN, First Publish Date - 2020-03-18T09:08:53+05:30

కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏపీలోని అన్ని దేవాలయాలకూ భక్తుల రద్దీ తగ్గింది. తిరుమల, ఇంద్రకీలాద్రి, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తగ్గుతున్న భక్తులు..
  • తిరుమలలో దర్శనానికి టైం స్లాట్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏపీలోని అన్ని దేవాలయాలకూ భక్తుల రద్దీ తగ్గింది. తిరుమల, ఇంద్రకీలాద్రి, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలు వెలవెలబోతున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా టైంస్లాట్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. కరోనా భయంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు శానిటైజేషన్‌ చర్యలు నిరంతరాయంగా జరుగుతున్నాయి.


శ్రీశైలంలో సామూహిక, గర్భాలయ అభిషేకం, భ్రమరాంబదేవికి నిర్వహించే కుంకుమార్చన సేవలతో పాటు చండీహోమం, రుద్రహోమం, ఇతర ఆర్జిత సేవలను ఈ నెల 31 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.  మల్లన్న దర్శనానికి క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా స్పర్శ దర్శనాన్ని కూడా ఈ నెల 31వరకు పూర్తిగా రద్దు చేశామన్నారు. భక్తులందరికీ అలంకార దర్శనాన్ని కల్నిస్తున్నామన్నారు. విజయవాడ దుర్గమ్మ కోవెల రెండు రోజులుగా వెలవెలబోతోంది. సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో మంగళవారం భక్తులు అతితక్కువ సంఖ్యలో కనిపించారు.

Updated Date - 2020-03-18T09:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising