ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్లాట్‌ బుకింగ్‌లకనుగుణంగానే రిజిస్ర్టేషన్లు-సీఎస్‌

ABN, First Publish Date - 2020-12-11T22:16:56+05:30

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభమైనపద్దతిలో ఆస్తుల విలువలకనుగుణంగా ఆన్‌లైన్‌ పద్దతిలో, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చలాన్‌ కనుగుణంగా చెల్లింపులు చే సుకుని బుక్‌చేసుకున్న స్లాట్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభమైనపద్దతిలో ఆస్తుల విలువలకనుగుణంగా ఆన్‌లైన్‌ పద్దతిలో, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చలాన్‌ కనుగుణంగా చెల్లింపులు చే సుకుని బుక్‌చేసుకున్న స్లాట్‌కు అనుగుణంగా రిజిస్ర్టేషన్‌ కార్యాలయానికి వె ళ్లాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌పేర్కొన్నారు. రిజిస్ర్టేషన్‌కు సంబంధించి పాత చార్జీలే అమలులో ఉన్నాయన్నారు.రిజిస్ర్టేషన్‌ చేయవలసిన ప్రాపర్టీ వివరాలు నమోదుచేయగానే సిస్టం ద్వారా రిజిస్ర్టేషన్‌ చార్జీ, స్టాంపు డ్యూటీ , ఇతర చార్జీల చెల్లింపు వివరాలు జనరేట్‌ అవుతాయన్నారు. ఆధార్‌ ఇవ్వని వారి కోసం ప్రత్యేక పద్దతిని పాటిస్తామన్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌ కోసం అవసరమైన స్లాట్‌ బుకింగ్‌ పద్దతిని సీఎస్‌ శుక్రవారం బిఆర్‌కె భవన్‌లో ప్రారంభించారు. 


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ మేరకు హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ ద్వారా పారదర్శకంగా , సులభతరంగా , ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్‌లైన్‌పద్దతి ద్వారా జరుగుతాయని అన్నారు. ప్రస్తుతం ప్రతి రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్‌లను కేటాయిస్తామని, డిమాండ్‌ మేరకు వాటిని పెంచడం జరుగుతుందన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు వార్‌ రూంలో పనిచేస్తున్న టెక్నికల్‌ టీం పరిష్కరిస్తుందని సీఎస్‌ తెలిపారు. 


రిజిస్ర్టేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. స్లాట్‌ బుకింగ్‌కోసం టిపిన్‌, పిటిన్‌ అసెస్‌మెంట్‌ నంబర్లను ఫీడ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవి లేని వారు లోకల్‌ బాడీస్‌ దరఖాస్తుచేయగానే రెండు రోజుల్లో వారికి అధికారులు పీటిన్‌ నెంబరునుజారీ చేస్తారన్నారు. ప్రస్తుతం 96శాతం నుంచి 97శాతం వరకూ రిజిస్ర్టేషన్‌ సర్వీసులను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న సమయానికి అనుగుణంగా కొనుగోలు దారులు, అమ్మకం దారులు, సాక్షులు తమ ఐడీ ప్రూఫ్‌లతో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. 


కాగా రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. రిజిస్ర్టేషన్‌ అనంతరం ఈ-పాస్‌బుక్‌ జారీ అవుతుందని, ఏడు నుంచి పది రోజుల్లోపు రెగ్యులర్‌పాస్‌బుక్‌ జారీ అవుతుందని తెలిపారు. 

Updated Date - 2020-12-11T22:16:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising