ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు మద్యానికి భలే గిరాకీ

ABN, First Publish Date - 2020-05-10T08:57:17+05:30

ఏపీలోని రెడ్‌జోన్లలో మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఆధార్‌ కార్డు చూపిస్తేనే మద్యం అమ్మాలని జోగుళాంబ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల, మే 9 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని రెడ్‌జోన్లలో మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఆధార్‌ కార్డు చూపిస్తేనే మద్యం అమ్మాలని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ తహసీల్దార్‌ మదన్‌మోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే అమ్మకాలు బంద్‌ చేయిస్తానని హెచ్చరించారు. మద్యం కొనుగోలుకు వచ్చిన వారి ఆధార్‌కార్డులను స్వయంగా పరిశీలించారు. తెలంగాణకు చెందిన మూడు మద్యం దుకాణాలు కర్నూల్‌ జిల్లా సరిహద్దులో ఉంటాయి. జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన నాటి నుంచి ఎక్కడ కూడా పెద్ద క్యూలు లేవు. కానీ, అలంపూర్‌ చౌరస్తాలోని రెండు, అలంపూర్‌ మునిసిపాలిటీలో ఒకటి, రాజోలి ప్రాంతంలో రెండు మద్యం దుకాణాల ముందు మాత్రం భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. దీంతో రెవెన్యూ అధికారులకు అనుమానం వచ్చింది. పరిశీలించగా.. అందరూ కర్నూల్‌, నందికొట్కూర్‌తో పాటు సరిహద్దు పల్లెలకు చెందిన వారే ఉన్నారు. దీంతో పుల్లూరు చెక్‌పోస్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Updated Date - 2020-05-10T08:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising