ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు

ABN, First Publish Date - 2020-03-31T00:59:21+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగ పడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు అందించాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగ పడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు అందించాయి. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. హెటిరో డ్రగ్స్‌ సంస్థ తరపున 5కోట్ల రూపాయల విరాళం అందించారు. దీంతోపాటు మరో 5కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సీక్లోరోక్విన్‌,రిటోనవిర్‌,లోపినవిర్‌, ఒసెల్టమివిర్‌) కూడా ప్రభుత్వానికి అందించారు. చెక్కును మంత్రికి, మందులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు హెటిరోఛైర్మన్‌ పార్ధసారధిరెడ్డి, డైరెక్టర్‌రత్నాకర్‌రెడ్డి అందించారు. తెలంగాణ మోటార్‌ వెహికిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అసోసియేషన్‌ తరపున 1.5 కోట్ల విరాళాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్‌ అధ్యక్షుడు పాపారావు తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. సుమెన్‌ ఫార్మా కోటి రూపాయల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సువెన్‌ ఫార్మా ఛైర్మన్‌ వెంకట్‌ జాస్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. ఎన్‌సిసి లిమిటెడ్‌ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి రంగరాజు ముఖ్యమంత్రికి అందించారు. శ్రీచైతన్య విద్యాసంస్థలు కోటి రూపాయల విరాళం అందించాయి. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్ద డైరెక్టర్‌ వై. శ్రీధర్‌ ముఖ్యమంత్రికి అందించారు. 

Updated Date - 2020-03-31T00:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising