ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉపాధి’ వేతనాలు ముందుగా చెల్లించాలి

ABN, First Publish Date - 2020-04-15T09:22:10+05:30

రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గే వరకు ఉపాధి హామీ పనులను వాయిదా వేయాలని ప్రభుత్వానికి మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అమర్‌, వేదిక ఏపీ, తెలంగాణ సమన్వయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనులు వాయిదా వేయాలి: మానవ హక్కుల వేదిక


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గే వరకు ఉపాధి హామీ పనులను వాయిదా వేయాలని ప్రభుత్వానికి మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అమర్‌, వేదిక ఏపీ, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు జీవన్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, ఉపాధి హామీ కూలీలకు లాక్‌డౌన్‌ కాలానికి వేతనాలు ముందుగానే చెల్లించాలని కోరారు. ఉపాధి పనుల కోసం ఒకే చోట 20 మందికి పైగా కూలీలు చేరే చోట భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదన్నారు. పనిముట్లు, గంపలు ముట్టుకోవడం, తవ్వడం, లెవెలింగ్‌ పనుల సందర్భంగా ఒకరిని మరొకరు తుగులుతారని, దీంతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో 70 వేల మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తే వైర్‌సను అరికట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందన్నారు. పశువులకు నీళ్లు తాగించి తన పొలం నుంచి ఇంటికెళ్తున్న రైతునే మాస్క్‌ లేదన్న నెపంతో పోలీసులు కొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్లిష్ట సమయంలో కూలీలకు లభించే కొద్దిపాటి డబ్బు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పరిస్థితి చక్కబడే వరకూ పనులను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2020-04-15T09:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising