ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కాగా ఎన్నికల ప్రవర్తన నియమావళి

ABN, First Publish Date - 2020-11-19T09:58:17+05:30

గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రతి సర్కిల్‌కు ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంలోకి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లు


హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌18 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రతి సర్కిల్‌కు ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌ (ఎస్‌ఎ్‌సటీ)లను ఏర్పాటు చేస్తూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. 30 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో ఒక అధికారి, ముగ్గురు లేదా నలుగురు పోలీసులు, ఒక వీడియో గ్రాఫర్‌ ఉంటారు. అదేవిధంగా ప్రతి స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లో ఒక అధికారితో పాటు ముగ్గురు పోలీసులు, ఒక వీడియో గ్రాఫర్‌ ఉంటారు. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ, సంఘ విద్రోహ చర్యలు, పరిమితిని మించి ధనాన్ని వ్యయం చేయడం, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండడం తదితర చర్యలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రతి స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లు చెక్‌ పోస్టులు, ప్రధాన కూడళ్లు, సర్కిళ్ల సరిహద్దులలో  మోహరిస్తాయి.


ఫ్లయింగ్‌ సర్వేలెన్స్‌ టీమ్‌

ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు విధి నిర్వహణను చేపట్టాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమణ సంబంధిత ఫిర్యాదులు, బెదిరింపులు, సంఘ విద్రోహ శక్తుల కదలికలు, మద్యం పంపిణీ, డబ్బు చలామణి తదితర అంశాలను ఈ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పరిశీలిస్తాయి. వివిధ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ప్రధాన ర్యాలీలు, బహిరంగ సభలను వీడియోగ్రఫీ చేస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు 24గంటల పాటు ఈ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు విధి నిర్వహణలో ఉంటాయి. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తున్నట్లు సమాచారం అందగానే ఈ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుంటాయి. ఎక్కడైనా డబ్బుల పంపిణీ, ప్రవర్తన నియమావళి అతిక్రమణలు జరిగే ప్రాంతానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు చేరుకోలేని పక్షంలో సమీపంలోని స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లకు సమాచారం అందించడం లేదా డయల్‌ 100కు సమాచారం ఇస్తాయి. 

Updated Date - 2020-11-19T09:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising