ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంబర్‌ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై సీపీ సీరియస్‌

ABN, First Publish Date - 2020-03-12T09:27:25+05:30

నంబర్‌ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై సీపీ అంజనీకుమార్‌ సీరియస్‌ అయ్యారు. నంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనాలను నడిపే వారిని చైన్‌, సెల్‌ఫోన్‌ స్నాచర్లుగా అనుమానించాల్సి వస్తుందని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌

ఒక్కరోజే 384 వాహనాలపై చర్యలు

నంబర్‌ లేని వాహనం కనిపిస్తే ఫొటో తీసి వాట్సా్‌పలో పంపించండి 


హైదరాబాద్‌ సిటీ మార్చి 11 (ఆంధ్రజ్యోతి): నంబర్‌ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై సీపీ అంజనీకుమార్‌ సీరియస్‌ అయ్యారు. నంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనాలను నడిపే వారిని చైన్‌, సెల్‌ఫోన్‌ స్నాచర్లుగా అనుమానించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్నాచింగ్‌ కేసుల్లో పట్టుబడిన వారి వాహనాలకు సరైన నంబర్లు లేకపోవడం లాంటి రెండువేలకు పైగా రికార్డులు పోలీసుల వద్ద ఉన్నాయని ట్వీట్‌ చేశారు. నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌, ప్లేట్లను వంచడం, నంబర్‌ కనిపించకుండా స్టిక్కర్లు అతికించడం లాంటివి వాటిపై పోలీసులు దృష్టి సారించారు. మంగళవారం నగర వ్యాప్తంగా చేపట్టిన డ్రైవ్‌లో 384 వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ వాహనాలు కనిపిస్తే ఫొటోలు తీసి 9490616555 ఫోన్‌ నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని ప్రజలకు సూచించారు. 


నెంబర్‌ ప్లేట్లతో ఆటలా?

నంబర్‌ ప్లేట్ల విషయంలో నగరంలో చాలామంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలపై నంబర్లు సరిగా రాయకపోవడం, డిజైన్లతో నంబర్‌ పేట్ల స్వరూపాన్ని మార్చేయడంతోపాటు మరికొంతమంది నంబర్‌ రాయడం లేదు. చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది నంబర్‌ ప్లేట్లను ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. గతంలో వరుసగా చైన్‌ స్నాచింగ్‌లు జరిగినప్పుడు 1600 వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత నంబర్‌ ప్లేట్లపై దృష్టి సారించకపోవడంతో మళ్లీ రెచ్చిపోయారు. సీపీ హెచ్చరికలతో ట్రాఫిక్‌ పోలీసులు ఈసారి ఎంతమందిని పట్టుకుంటారో చూడాలి. 


వాహనం నంబర్‌ కనిపించకపోతే చర్యలు

రాతలు, గీతలతో నంబర్‌ కనిపించకుండా ఉల్లంఘటనలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొంతమంది నంబర్‌ ప్లేట్లను ట్యాంపరింగ్‌ చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉల్లలంఘనలకు పాల్పడే వారు నంబర్‌ ప్లేట్లను సరిచేసుకోవాలని సీపీతోపాటు ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి వాహనాలను గుర్తించిన ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. 

Updated Date - 2020-03-12T09:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising