ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హిందీ కథ- శ్రామిక వర్గ సమస్యలు’ పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2020-03-13T09:51:45+05:30

శ్రమజీవుల జీవన విధానాన్ని అక్షరరూపంగా వివరించిన తీరు బాగుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవీంద్రభారతి, మార్చి12 (ఆంధ్రజ్యోతి): శ్రమజీవుల జీవన విధానాన్ని అక్షరరూపంగా వివరించిన తీరు బాగుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ రచయితల సంఘం-జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ పరిశోధకురాలు డా.కె.అన్ష రచించిన గడిచిన రెండు దశాబ్దాల ‘హిందీ కథ- శ్రామిక వర్గ సమస్యలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది.


ముఖ్యఅతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ పరిశోధించి పుస్తకాలు రాయడం గొప్ప విషయమన్నారు. శ్రామిక వర్గాల సమస్యలపై ఇలాంటి పుస్తకం రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, ప్రొ.మాయాదేవి, డా.చంద్రముఖర్జీ, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్‌కుమార్‌, డా.బన్సీలాల్‌, రాణాప్రతా్‌పసింగ్‌, నర్సింగ్‌, గాయత్రి, దివాకర్‌రెడ్డి తదితరులు రచయిత్రిని అభినందించారు.

Updated Date - 2020-03-13T09:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising