ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాకింగ్‌కు వెళ్తే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు

ABN, First Publish Date - 2020-05-18T09:21:47+05:30

ట్యాంక్‌బండ్‌ వద్దకు వాకింగ్‌కు వెళితే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ ఓ యువతి ట్విటర్‌ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్విటర్‌ ద్వారా డీజీపీ, సీపీకి యువతి ఫిర్యాదు

చిక్కడపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): ట్యాంక్‌బండ్‌ వద్దకు వాకింగ్‌కు వెళితే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ ఓ యువతి ట్విటర్‌ ద్వారా డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది. తన సోదరుడిని డాక్టర్‌ సూచనల మేరకు వాకింగ్‌కు తీసుకొచ్చామని చెప్పినా పోలీసులు వినలేదని, ఆపి వేధించారని యువతి ఆరోపించింది. ఘటనా స్థలానికి వచ్చిన తన తండ్రిని కూడా పోలీసులు దూషించారని, తండ్రిని పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి ఆయనపై, సోదరుడిపై కేసు పెట్టారని పేర్కొంది. యువతి ఫిర్యాదుపై స్పందించిన చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ పి. శివశంకర్‌రావు ట్విటర్‌లో వివరణ ఇచ్చారు.


యువతి, ఆమె సోదరుడు మాస్కు సరిగా పెట్టుకోకుండా జాగింగ్‌కు వచ్చారని, ఈ విషయమై అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని ఆపి ప్రశ్నించారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఎస్‌ఐ కోటేష్‌ వారికి చెప్పినా వినకుండా వాగ్వాదం చేశారని అన్నారు. వారిని స్టేషన్‌కు తీసుకెళ్లే సమయంలో ఆమె సోదరుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడని సీఐ వివరించారు. ఆమె తండ్రి తన దుస్తులు చించుకోవడంతో పెట్టీ కేసు పెట్టామని సీఐ అన్నారు. దూర ప్రాంతానికి వాకింగ్‌కు ఇకముందు వెళ్లబోమని వారు ట్విటర్‌లో పేర్కొన్నారని సీఐ తెలిపారు.

Updated Date - 2020-05-18T09:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising