ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇందిరాపార్క్‌ వద్ద టీపీసీసీ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-22T17:48:35+05:30

టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద పంచాయతీ రాజ్ సత్యాగ్రహ దీక్ష మంగళవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద పంచాయతీ రాజ్ సత్యాగ్రహ దీక్ష మంగళవారం ప్రారంభమైంది. మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కన్వీనర్ హరీష్ పాల్వాయి, ఇంచార్జి కిరణ్ మూగబసవ, మరియు జెడ్పిటిసిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు దీక్షలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ..ఆత్మ గౌరవం కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అసలైన ప్రజా నేతలని...గ్రామాల్లో పనులు చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. చివరకు పార్టీ మారితే బిల్లులు ఇస్తామని అనేంతగా ప్రభుత్వం దిగజారి పోయిందని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులు ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి  ఉద్యమించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని... సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఉంటుందని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు.


Updated Date - 2020-12-22T17:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising