విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి: ప్రజా సంఘాలు
ABN, First Publish Date - 2020-12-16T04:41:37+05:30
రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్
కవాడిగూడ, డిసెంబర్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కువద్ద ఽనిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యుత్ ఉద్యోగులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, సీపీఎం నేత మల్లారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్, పి భూపాల్, ఈశ్వర్‌రావులు హాజరై మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని, దీనిని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఈపీఎఫ్, జీపీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీసం వేతనం, ఈఎ్‌సఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీజన్ కార్మికులందరికీ ఏపీఎ్‌సఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని వారు డిమాండ్ చేశారు. రీడర్ బిల్ కలెక్టర్, పీఏఏ, ఎంఆర్‌టీ, టీఆర్‌సీ స్టోరక్ష హమాలీలకు కనీస వేతనం ఈఎ్‌సఐ, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.కుమారచారి, ప్రధాన కార్యదర్శి వి.గోవర్ధన్, గౌరవ అధ్యక్షుడు ఆర్.సుధాభాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ స్వామి మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళతామని వారు హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో యూనియన్ నాయకులు కె వెంకట్‌నారాయణ, కె ఈశ్వర్‌రావు, జె ప్రసాద్‌రాజు, జె బస్వరాజు, రమేష్, ఈ మురళి, బి మధు, ఎస్ చంద్రారెడ్డి, వి.బాల్‌రాజ్‌లతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్ కార్మికులు దీక్షల్లో పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T04:41:37+05:30 IST