ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాకలో గెలిస్తే.. 2023లో అధికారం కాంగ్రె్‌సదే..

ABN, First Publish Date - 2020-10-13T09:47:30+05:30

దుబ్బాకలో గెలిస్తే.. 2023లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారమని.. ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలి

కాంగ్రెస్‌ సన్నాహక సదస్సులో ఠాకూర్‌ 


దుబ్బాక, అక్టోబరు 12: దుబ్బాకలో గెలిస్తే.. 2023లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారమని.. ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కార్యకర్తలకు, బూత్‌ కమిటీలకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి మణిక్కం ఠాకూర్‌ దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో.. సోమవారం రాత్రి దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సదస్సును నిర్వహించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను సేకరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను సమీకరించాలని నాయకులు సూచించారు. 60శాతం ఓట్లు రాబట్టుకోగలిగితే విజయాన్ని తప్పకుండా అందుకుంటామని పేర్కొన్నారు. పక్కనే ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌తో పోల్చితే కనీసం 2శాతం అభివృద్ధి కూడా దుబ్బాకలో జరగలేదనే అంశాన్నీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, ఎల్‌ఆర్‌ఎ్‌సను ప్రజలల్లోకి తీసుకెళ్లాలని పలువురు అభిప్రాయపడ్డారు.


బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బలహీనతలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే విజయాన్ని చేరుకోగలమని తెలిపారు. సోషల్‌ మీడియాలో ఉత్సాహాంగా పాల్గొనాలని చెప్పారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగాన్ని తప్పకుండా ఎత్తిచూపాలని, ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కితే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ భవనాలకు టీఆర్‌ఎస్‌ గులాబీ రంగులను వేయడంతోపాటు పలు బస్టాండ్లకు పోస్టర్లు, వాల్‌రైటింగ్‌లు ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, వారు దానిని స్వీకరించకుంటే తమ దృష్టికి తేవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. సుమారు 4గంటల పాటు జరిగిన ఈ సమామేశానికి మీడియాను అనుమతించలేదు. సదస్సులో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌ రాజనర్సింహా,  గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, రాజయ్యతో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-13T09:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising