ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులు

ABN, First Publish Date - 2020-12-27T05:06:46+05:30

తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధుల విషయంపై బహిరంగ చర్చకు సిద్దమా అని జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ముదుగంటి రవీందర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కు సవాల్‌ విసిరారు.

సమావేశంలో మాట్లాడుతున్న రవీందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 26: తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధుల విషయంపై బహిరంగ చర్చకు సిద్దమా అని జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ముదుగంటి రవీందర్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కు సవాల్‌ విసిరారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించిన ఎమ్మెల్యే సంజయ్‌ తీరుపై రవీందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర అవసరాల కోసం వాడుకుంటూ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. గడిచిన ఆరేళ్లలో రాష్ర్టానికి  కేంద్రం విడుదల చేసిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. నిధుల కేటాయింపుపై స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ బహిరంగ చర్చకు సిద్దమా అని రవీందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్‌ గుర్రం రాము, సీనియర్‌ నాయకులు ఏసీఎస్‌ రాజు,ఆన్‌కార్‌ సుధాకర్‌, లింగంపేట శ్రీనివాస్‌, శేఖర్‌రావు, భగవంతరావు, ఆముద రాజు, బడే శంకర్‌, విద్యాఠాకూర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising