ఘనంగా నాగుల పంచమి వేడుకలు
ABN, First Publish Date - 2020-11-19T05:56:43+05:30
నాగుల పంచమి వేడుకలను బుధవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బోయినిపేటలోని శ్రీ నాగులమ్మ ఆలయం తో పాటు పెంజేరుకట్టలోని శ్రీనాగమయ్య పుట్ట వద్ద భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంథని, నవంబరు 18: నాగుల పంచమి వేడుకలను బుధవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బోయినిపేటలోని శ్రీ నాగులమ్మ ఆలయం తో పాటు పెంజేరుకట్టలోని శ్రీనాగమయ్య పుట్ట వద్ద భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మైసమ్మ, రావి, వేప చెట్లకు ప్రత్యేక పూజలు చేశారు.
పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నాగదేవత ఆలయాల వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆవు పాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేశారు. పుట్ట శైలజ, పలువురు కౌన్సిలర్లు నా గులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భ క్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మంథని మండలంలో..
మంథని రూరల్: మండలంలోని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. గాజులపల్లిలోని శ్రీ సంతాన నాగేంద్రస్వామి ఆలయంతో పాటు గ్రామాల్లోని పుట్టల వద్ద పూలు, పండ్లతో భక్తులు పూజలు నిర్వహించారు. సంతాన నాగేంద్రస్వామిగా మంథని ప్రాంతంలో పేరుగాంచి ఉండటంతో గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున వచ్చి, పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలిరావడంతో ఆలయ ఆవరణ సందడిగా మారింది.
రామగిరిలో..
రామగిరి, నవంబరు 18: మండలంలోని ఆయా గ్రామాల్లో నాగుల చవితి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. గ్రామాల్లో పవి త్రస్నానాలు ఆచరించిన మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయాల్లోని పుట్టల్లో వెండి తో చేసిన నాగపడగలతో పాటు పాలు, పండ్లు నైవేద్యాలు సమర్పించారు. సెంటినరీకాలనీలోని ట్యాంక్ వద్ద వెలసిన పుట్టలో వైస్ ఎంపీపీ కాపురబోయి న శ్రీదేవి, మహిళలు పాలు పోసి పూజలు చేశారు.
కాల్వశ్రీరాంపూర్‌లో..
కాల్వశ్రీరాంపూర్, నవంబరు 18: మంలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నాగుల చదివి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు పూజలు నిర్వహించి పుట్టకు పాలుపోశారు. ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Updated Date - 2020-11-19T05:56:43+05:30 IST