ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్నాలకు మద్దతు ధర ప్రకటించాలి

ABN, First Publish Date - 2020-12-11T05:25:01+05:30

రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ బీజేపీ కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షుడు సత్యంరెడ్డి ఆధ్వర్యంలోని నాయకులు గురువారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ శ్రీకాంత్‌కు వినతి పత్రం అందించారు.

ఎల్లారెడ్డిపేటలో తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బీజేపీ కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి

ఎల్లారెడ్డిపేట, డిసెంబరు 10: రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ బీజేపీ కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షుడు సత్యంరెడ్డి ఆధ్వర్యంలోని నాయకులు గురువారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ శ్రీకాంత్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానంలో సన్న రకం వరి పంటలను సాగు చేయాలని చెప్పి కనీస మద్దతు ధర కల్పించకపోవడం అన్యాయమన్నారు. రెండేళ్లుగా రుణమాఫీ చేయకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారన్నారు. కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేయాలన్నారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని గోపి హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, మినాహాజ్‌ఖాన్‌, భాస్కర్‌, శ్రీశైలం, శ్రీనివాస్‌, సాయికుమార్‌, రవీందర్‌, ప్రశాంత్‌, రాజేశంగుప్తా, వెంకట్‌రెడ్డి, బాపురెడ్డి, సాయిలు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising