ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

ABN, First Publish Date - 2020-03-19T12:09:32+05:30

సీపీఐ మావోయిస్టు కొరియర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్య క్తులను బుధవారం దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు గ్రామ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, మార్చి 18: సీపీఐ మావోయిస్టు కొరియర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్య క్తులను బుధవారం దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు గ్రామ శివారులో పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భద్రాచలం తన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రాజే్‌షచంద్ర వెల్లడించారు. బుధవారం ఉ దయం సీఆర్‌పీఎఫ్‌ 39 బెటాలియన్‌ సిబ్బంది, దుమ్ముగూడెం పోలీసులు బైరాగులపాడు గ్రామం శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అది చూసిన ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారన్నారు.


వారిని తనిఖీ చేయగా వారి వద్ద సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన కొన్ని వాల్‌పోస్టర్లు లభ్యమయ్యాయన్నారు. ఆ వాల్‌ పోస్టర్లపై చర్ల, శబరి ఏరియా ఆదివాసీ విప్లవ రైతు కూలీ సంఘం, ఆదివాసీ విప్లవ మహిళా సంఘం పేర్లతో ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్నాయన్నారు. పట్టుబడిన వారు చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన శ్యామల రవి, దుమ్ముగూడెం మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన కణితి వెంకటేశర్లని విచారణలో తేలిందన్నారు. వీరు కొంత కాలంగా మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పని చేస్తున్నారని,  మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు వాల్‌పోస్టర్లు తీసుకొచ్చినట్టు విచారణలో వెల్లడైందని ఏఎస్పీ తెలిపారు. మావోయిస్టుల కార్యకలపాలపై సమాచారం అందించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-03-19T12:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising