ఏరియా వైద్యశాలకు నూతన వైద్య పరికరాలు
ABN, First Publish Date - 2020-12-16T05:18:23+05:30
భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు నూతన వైద్యపరి కరాలు సమకూరాయి.
ఎమ్మెల్యే, పీవో చొరవతో రూ.4.50 లక్షలతో కొనుగోలు
భద్రాచలం, డిసెంబరు 15: భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు నూతన వైద్యపరి కరాలు సమకూరాయి. ఏరియా వైద్యశాలకు మంగళవారం కామన్ బ్లడ్ పిక్చర్(సీబీపీ), బయోకెమిస్ట్రీ ఎనలైజర్ వైద్య పరికరాలు వచ్చాయి. భద్రాచలంలోని ఏరియా వైద్యశాలకు నిత్యం వందలాది మంది రోగులు వస్తూ వైద్య పరీక్షలు చికిత్సలు చేయించుకుంటూ ఉం టారు. ప్రస్తుతం ఉన్న సీబీపీ వైద్య పరికరానికి కొన్ని సమయాల్లో సాంకేతికమైన స మస్యలు తలెత్తుండటంతో అదనంగా మరో సీబీపీ వైద్య పరికరాన్ని కొనుగోలు చేశారు. బయోకెమిస్ట్రీ అనలైజర్ పరికరాన్ని సైతం కొనుగోలు చేశారు. వీటి ద్వారా హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్ కౌంటు, లివర్‌ఫంక్షన్ టెస్టు తదితర వైద్య పరీక్షలను నిర్వహించవచ్చునని వైద్యాధికారులు పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఐటీడీఏ పీవో పి.గౌతమ్ ప్రత్యేక చొరవతో వీటిని రూ.4.50 లక్షలతో కొనుగోలు చేసారు. వీటిని త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు.
Updated Date - 2020-12-16T05:18:23+05:30 IST