ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-08-18T11:27:05+05:30

గోదావరి పోటెత్తుతుండటం, కిన్నెరసాని లాంటి వాగులు, ఉమ్మడి జిల్లాలోని వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికార ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వానలు, వరదల నేపథ్యంలో మంత్రి పువ్వాడ ఆదేశం


ఖమ్మం, ఆగస్టు 17: గోదావరి పోటెత్తుతుండటం, కిన్నెరసాని లాంటి వాగులు, ఉమ్మడి జిల్లాలోని వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. ఖమ్మంలో సోమవారం ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లతో పాటు ఇతర అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. వర్షాలు, వరద సమాచారం తెలుసుకున్న ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.


మరికొద్దిరోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున మండల, గ్రామస్థాయి అధికారులు, ఉద్యోగులు స్థానికంగా అందుబాటులో ఉండాలని, ప్రజా, సరుకు రవాణకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదముంపు కాలనీలోని ప్రజలకు పునరవాసానికి తరలించి వారికి కావాల్సిన భోజన, వసతి సౌకర్యాలు కలిపించాలని, వరద, వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలిపేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

Updated Date - 2020-08-18T11:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising