ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తంగేడు వనం ప్రారంభం!

ABN, First Publish Date - 2020-06-26T07:44:07+05:30

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ సమీపంలోని లక్కారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో తంగేడు వనాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ సమీపంలోని లక్కారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో తంగేడు వనాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ వనాన్ని 50.08 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.45 కోట్లతో అటవీశాఖ అభివృద్ధి చేసింది. ఎంట్రీ ప్లాజా, సరస్సు, బర్డ్‌ వాచింగ్‌ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. సందర్శకుల మానసిక, శారీరక దారుఢ్యం కోసం రాక్‌ గార్డెన్‌, యోగా సెంటర్‌, వాక్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నాయి. కాగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాల్లో పలువురు మంత్రులు ఆరో విడత హరిత హారంలో పాల్గొన్నారు. రహదారుల వెంట విరివిగా మొక్కలు నాటించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలోని గీసుకొండ, పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరులో దాదాపు 14 కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు.

Updated Date - 2020-06-26T07:44:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising