మధుసూదన్‌ మృతిపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-06-05T22:13:01+05:30

వనస్థలిపురానికి చెందిన అల్లంపల్లి మధుసూదన్‌ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. మధుసూదన్‌ భార్య హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

మధుసూదన్‌ మృతిపై హైకోర్టులో విచారణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వనస్థలిపురానికి చెందిన అల్లంపల్లి మధుసూదన్‌ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. మధుసూదన్‌ భార్య హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనాతో మధుసూదన్‌ మృతిచెందినట్టు హైకోర్టుకు వైద్యశాఖ తెలిపింది. మధుసూదన్‌ డెత్‌ సర్టిఫికెట్, చితాభస్మం ఉన్నాయని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. డెత్‌ సర్టిఫికెట్, చితాభస్మంను మధుసూదన్‌ భార్యకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 9కి హైకోర్టు వాయిదా వేసింది. 


తన భర్త అల్లంపల్లి మధుసూదన్‌ ఆచూకీ తెలపాలని కోరుతూ ఆయన భార్య మాధవి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన మామ కొవిడ్‌ సోకి చనిపోయారని, తర్వాత చేసిన వైద్య పరీక్షల్లో తన భర్తకు పాజిటివ్‌ వచ్చినట్లు తేలిందని, దీంతో ఆయనను ఏప్రిల్‌ 30న గాంధీ ఆసుపత్రికి మార్చినట్లు తెలిపారు. తర్వాత తనకు, పిల్లలకు కింగ్‌కోఠి ఆసుపత్రిలో పరీక్షలు చేసి మే 2న గాంధీకి తరలించారన్నారు. తన భర్తతో తాను చివరిసారిగా మే 1న ఫోన్‌లో మాట్లాడానని, ఆ తర్వాత ఆయన ఆచూకీ తెలియడం లేదని మాధవి వాపోయారు.

Updated Date - 2020-06-05T22:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising