ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హజ్‌యాత్రను నిష్టతో చేయాలి

ABN, First Publish Date - 2020-03-15T12:44:41+05:30

పవిత్ర హజ్‌ యాత్రను నిష్టతో పూర్తి చేయాలని దారుల్‌ఉలూమ్‌ మహ్మద్‌ వసీమ్‌ అన్సారీ, హజ్‌ సొసైటీ చీఫ్‌ ప్యాట్రన్‌ మహ్మద్‌ హఫీజ్‌ఖాన్‌ పేర్కొన్నారు. జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దారుల్‌ఉలూమ్‌ మహ్మద్‌ వసీమ్‌ అన్సారీ, మహ్మద్‌ హఫీజ్‌ఖాన్‌

కందనూలు, మార్చి 14 : పవిత్ర హజ్‌ యాత్రను నిష్టతో పూర్తి చేయాలని దారుల్‌ఉలూమ్‌ మహ్మద్‌ వసీమ్‌ అన్సారీ, హజ్‌ సొసైటీ చీఫ్‌ ప్యాట్రన్‌ మహ్మద్‌ హఫీజ్‌ఖాన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్‌లో హజ్‌ యాత్రపై శనివారం జిల్లా హజ్‌ సొసైటీ అధ్యక్షుడు షేక్‌ ఫరీద్‌ అహ్మద్‌ అధ్యక్షతన హజ్‌ యాత్రికులకు శిక్షణ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల నుంచి ఎంపికైన హజ్‌యాత్రికులు, ఉమ్రా యాత్రికులు పాల్గొనగా..  మహబూబ్‌నగర్‌ జిల్లా హజ్‌ సొసైటీ బాధ్యులు ఖలీల్‌ అహ్మద్‌, అహ్మద్‌ పటేల్‌, హజ్‌ సొసైటీ సెంట్రల్‌ ట్రైనర్‌ నజీరోద్దీన్‌ పాల్గొని హజ్‌ యాత్రికులకు హజ్‌యాత్రలో చేపట్టాల్సిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులు అన్ని విషయాలను క్లుప్తంగా విని ఆచరించాలన్నారు. యాత్రలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీరికి హజ్‌ యాత్రలో అనుసరించాల్సిన అంశాలు, సెంట్రల్‌ హజ్‌ సొసైటీ ట్రైనర్‌ రఫీక్‌ఉర్‌ రెహమాన్‌, నజీర్‌ అహ్మద్‌ ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. హజ్‌ యాత్రలో భాగంగా మక్కా, మదీన షరీఫ్‌లలో అనుసరించాల్సిన అంశాలు, ప్రాథమిక అంశాలు, అయేహేరామ్‌, తవాఫ్‌ తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఇబ్రహీం, యాఖుబ్‌చౌష్‌, సాధిక్‌పాషా, నిజామోద్దీన్‌, నూరుల్‌హక్‌, అమీర్‌పాషా, అబ్దుల్‌హక్‌, శంషీర్‌ఖాన్‌, వకీల్‌ అహ్మద్‌, నయీమోద్దీన్‌, బాబు, ఏజాజ్‌, మౌలాపీరా, ముబీన్‌ఖాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-15T12:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising