ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సంక్షేమానికి పెద్దపీట

ABN, First Publish Date - 2020-04-18T10:22:12+05:30

తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి


కందనూలు, ఏప్రిల్‌ 17: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ మండల పరిధిలోని గన్యాగుల గ్రామంలో గ్రామపంచాయతీ భవనం, పీఏసీఎస్‌ నూతన భవనాలను ప్రారంభించారు.  అనంతరం  గన్యాగుల గ్రామంలో పేద ప్రజలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 


సీపీఎం ఆధ్వర్యంలో 

శుక్రవారం మండల పరిధిలోని మంతటి గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికులు, పేదలకు  సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కే.గీత మాస్కులు, సబ్బులు పంపిణీ చేశారు.  మండల కార్యదర్శి ఎం.మధు, గ్రామ సర్పంచ్‌ నాగమణి, సీపీఎం నాయకులు తిరుపతయ్య, శ్రీను, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. 


పెద్దముద్దునూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నాగర్‌కర్నూల్‌ మండల పరిధిలోని పెద్దముద్దునూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గన్యాగుల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  అనంతరం పెద్దముద్దునూర్‌ గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.  డీసీసీబీ డైరెక్టర్‌ జక్కారఘునందన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీశైలం, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, గన్యాగుల పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణయ్య, సర్పంచ్‌ నిర్మల, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-04-18T10:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising