ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమంత్రులను కలిసిన ఎంపీ మన్నె

ABN, First Publish Date - 2020-02-12T12:03:58+05:30

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, రమేష్‌ పోఖ్రియాల్‌ని కలిశారు. వేర్వేరుగా ఇద్దరు మంత్రులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జాతీయ రహదారిపై అండర్‌ పాసుల నిర్మాణాలకు వినతి
  • దేవరకద్రలో జవహర్‌ నవోదయ విద్యాలయం కోసం విన్నపం

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, రమేష్‌ పోఖ్రియాల్‌ని కలిశారు. వేర్వేరుగా ఇద్దరు మంత్రులను కలిసిన ఆయన తన నియోజకవర్గంలోని పలు పనులను వెంటనే చేపట్టాలని వినతిపత్రాలు అందజేశారు. తొలుత ఉదయం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిశారు. 44వ జాతీయ రహదారిపై కొత్తూరు నుంచి కొత్తకోట వరకు అండర్‌ పాసు బ్రిడ్జిలు, కొత్త సర్వీసు రోడ్లు, అండర్‌ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. కొత్తకోట మండలం కనిమొట్ట వద్ద, మూసాపేట మండలం వేముల వద్ద, రాజాపూర్‌ మండలం ముదిరెడ్డిపల్లి వద్ద అండర్‌ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు నిర్మించాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ని కలిసి పలు సమస్యలపై విన్నవించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా జవహర్‌ నవోదయ విద్యాలయం లేదని, దేవరకద్ర నియోజకవర్గంలో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వినతులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు.

Updated Date - 2020-02-12T12:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising