ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి విత్తన సాగుకు..క్రాప్‌ హాలిడే?

ABN, First Publish Date - 2020-05-10T10:20:25+05:30

పత్తి విత్తన సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. మొన్నటి వరకు పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచాలని రైతుల ఆందోళనలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యాకెట్‌ ధరపై రూ.20 పెంచాలంటున్న రైతులు

రూ.20 తగ్గిస్తామంటున్న విత్తన కంపెనీలు

ధరలు తగ్గిస్తే క్రాప్‌ హలీడే ఇస్తామంటున్న ఆర్గనైజర్లు


గద్వాల, మే 8 (ఆంధ్రజ్యోతి) : పత్తి విత్తన సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. మొన్నటి వరకు పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచాలని రైతుల ఆందోళనలు, ధరలు తగ్గించాలని కపెంనీలు ప్రతిపాదనలు చేశాయి. దీంతో సీడ్‌ ఆర్గనైజర్లు తాజాగా పత్తి విత్తన సాగు క్రాప్‌హాలిడే ప్రకటించాలని భావిస్తుండటంతో, పత్తి విత్తన సాగు జోగుళాంబ గద్వాల జిల్లాలో జరుగుతుందా అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.


జిల్లాలో ప్రతి ఏడాది 45 వేల ఎకరాల్లో పత్తి విత్తన సాగు జరుగుతుంది. పత్తి విత్తన ప్యాకెట్‌కు రూ.410 నుంచి రూ.430 మేర వివిధ కంపెనీలు రైతులకు చెలిస్తున్నాయి. ఈ ధరలపై మరో రూ.20 పెంచి, రైతులతో అగ్రిమెంట్‌ చేసుకొని సాగును కొనసాగించాలని నడిగడ్డ రైతాంగ పోరాట సమితి నాయకుడు రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాడు.


కంపెనీలు పెంచితే తప్ప, తాము ధరలు పెంచలేమని సీడ్‌ అర్గనైజర్లు చెబుతున్నారు. కానీ, విత్తన కంపెనీలు ప్రస్తుత ధరల కంటే రూ.20 తగ్గించి ప్యాకెట్‌ ఇస్తామని చెపుతుండటంతో పత్తి విత్తన సాగు సంకటంలో పడింది.

Updated Date - 2020-05-10T10:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising